ఇస్లాంలో కొనసాగను: పాకిస్థానీ బాలిక
పాకిస్థాన్‌కు చెందిన 15 ఏండ్ల హిందూ బాలిక మెహెక్ గురువారం స్థానిక కోర్టుకు హాజరై తన వాంగ్మూలాన్ని ఇచ్చింది. తనను అక్రమంగా వివాహం చేసుకున్న అలీ రజా మాచితో కలిసి ఉండటానికి విముకత వ్యక్తం చేసింది. ఇస్లాంలో కూడా కొనసాగాలని అనుకోవడం లేదని తెలిపింది. తల్లిదండ్రుల వద్దకు పంపాలని, హిందూ మతంలోనే కొనసాగడానికి అవకాశం కల్పించాని కోర్టును అభ్యర్థించింది. ఈ విషయాన్ని మెహెక్ న్యాయవాది రాజేశ్ నారాయణ్ దాస్ కపూర్ ఓ వార్తా […]
పాకిస్థాన్‌కు చెందిన 15 ఏండ్ల హిందూ బాలిక మెహెక్ గురువారం స్థానిక కోర్టుకు హాజరై తన వాంగ్మూలాన్ని ఇచ్చింది. తనను అక్రమంగా వివాహం చేసుకున్న అలీ రజా మాచితో కలిసి ఉండటానికి విముకత వ్యక్తం చేసింది. ఇస్లాంలో కూడా కొనసాగాలని అనుకోవడం లేదని తెలిపింది. తల్లిదండ్రుల వద్దకు పంపాలని, హిందూ మతంలోనే కొనసాగడానికి అవకాశం కల్పించాని కోర్టును అభ్యర్థించింది. ఈ విషయాన్ని మెహెక్ న్యాయవాది రాజేశ్ నారాయణ్ దాస్ కపూర్ ఓ వార్తా సంస్థకు ఫోన్ ద్వారా తెలిపారు. జకోబబాద్ రెండో అదనపు జడ్జి గులాం అలీ కాన్సరో తన ఛాంబర్‌లో మెహెక్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. జనవరి 21న తన ఇష్టాప్రకారం ఇస్లాం స్వీకరించి, అలీ రజాను వివాహం చేసుకున్నానని పొరపాటున చెప్పానని తెలిపింది. వాదనలు విన్న కోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించనుంది. విచారణ సందర్భంగా మౌల్వీలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Read Also..
http://www.dishadaily.com/actor-brahmaji-son-sanjay-s-o-pitta-katha-movie/