ఎక్కువ ధరకు విక్రయించొద్దు
దిశ, కరీంనగర్: లాక్‌డౌన్ సందర్భంగా కూరగాయలను ఎక్కువ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి కలెక్టర్ అబ్దుల్ అజీమ్ హెచ్చరించారు. జిల్లాలోని మహదేవపూర్, కాటారం మండలాల్లో మంగళవారం పర్యటించిన ఆయన వలస కూలీలకు బియ్యం, నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహదేవపూర్ కూరగాయల మార్కెట్‌కు వెళ్లి కూరగాయల ధరలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ ధరకు విక్రయిస్తే క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే అమ్మాలని వారికి సూచించారు. లాక్ […]
దిశ, కరీంనగర్: లాక్‌డౌన్ సందర్భంగా కూరగాయలను ఎక్కువ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి కలెక్టర్ అబ్దుల్ అజీమ్ హెచ్చరించారు. జిల్లాలోని మహదేవపూర్, కాటారం మండలాల్లో మంగళవారం పర్యటించిన ఆయన వలస కూలీలకు బియ్యం, నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహదేవపూర్ కూరగాయల మార్కెట్‌కు వెళ్లి కూరగాయల ధరలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ ధరకు విక్రయిస్తే క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే అమ్మాలని వారికి సూచించారు. లాక్ డౌన్ సాకుతో ఏ మాత్రం ధరలు పెంచినా సహించేది లేదని కలెక్టర్ సష్టం చేశారు.
Tags: bhupalapally,collector abdul ajim,distribute rice