సన్‌రైజర్స్ కెప్టెన్సీ నాకో గౌరవం : వార్నర్
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్‌లో ఈ సీజన్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తిరిగి సారథిగా ఎంపిక ఎవుతానని తాను ఊహించలేదని.. ఇది నాకు దక్కిన పదవి కాదని ఇదో గౌరవంగా భావిస్తానని ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వ్యాఖ్యానించాడు. వార్నర్ నేతృత్వంలోనే 2016లో సన్‌రైజర్స్ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. బాల్ టాంపరింగ్ వివాదం నేపథ్యంలో 2018లో అతను క్రికెట్ నుంచి నిషేధానికి గురి కావడంతో సన్‌రైజర్స్ కెప్టెన్సీ కోల్పోయాడు. గత ఏడాది జట్టులోకి […]
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్‌లో ఈ సీజన్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తిరిగి సారథిగా ఎంపిక ఎవుతానని తాను ఊహించలేదని.. ఇది నాకు దక్కిన పదవి కాదని ఇదో గౌరవంగా భావిస్తానని ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వ్యాఖ్యానించాడు. వార్నర్ నేతృత్వంలోనే 2016లో సన్‌రైజర్స్ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. బాల్ టాంపరింగ్ వివాదం నేపథ్యంలో 2018లో అతను క్రికెట్ నుంచి నిషేధానికి గురి కావడంతో సన్‌రైజర్స్ కెప్టెన్సీ కోల్పోయాడు. గత ఏడాది జట్టులోకి వచ్చినా కెప్టెన్సీ మాత్రం దక్కలేదు. అయితే పునరాగమనంలోనే 692 పరుగులతో సీజన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఏడాది సన్‌రైజర్స్ యాజమాన్యం అతడికే కెప్టెన్సీని కట్టబెట్టింది.
దీనిపై వార్నర్ స్పందిస్తూ.. ‘సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తిరిగి కెప్టెన్‌గా ఉండటం గౌరవంగా భావిస్తున్నాను. తిరిగి నాకు కెప్టెన్సీ దక్కుతుందని భావించలేదు. నాకు జట్టులోని ఆటగాళ్లు, సిబ్బంది, యాజమాన్యంతో గొప్ప సంబంధం ఉంది. అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జట్టులోని ప్రతీ ఒక్కరూ నాయకులే. నాతో విలియమ్‌సన్ ఎప్పుడూ ఆలోచనలు పంచుకుంటూ ఉంటాడు. మేం ఇద్దరం ఏ స్థానంలో ఉన్నా తేడా ఉండదు. పేరు ముందు కెప్టెన్ ఉందా లేదా అని ఆలోచించను. నేను గతేడాది కూడా కెప్టెన్ అనే అనుకున్నాను. మరోసారి ఐపీఎల్ టైటిల్ గెలవడానికి ప్రయత్నిస్తాను’ అని వార్నర్ అన్నాడు.