రైతులను ఢిల్లీకి రానివ్వొద్దు..!

న్యూఢిల్లీ: పంజాబ్, హర్యానాల నుంచి రైతులు ఢిల్లీకి రాకుండా అడ్డుకోవాలని ఢిల్లీ పోలీసులు లేఖ రాశారు. ఢిల్లీలో ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్నాయని రెండు రాష్ట్రాల డీజీపీలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. జనవరి 26న శాంతి భద్రతలు సమస్య ఎదురైందని, వారిని ఢిల్లీకి అనుమతిస్తే అలాంటి పరిస్థితులే పునరావృతమయ్యే ముప్పు ఉన్నదని హెచ్చరించారు. కాబట్టి వారిని ఆయా రాష్ట్రాలు వీడకుండా అడ్డుకోవాలని సూచించారు. అలాగే, ఢిల్లీకి వస్తున్న ఆందోళనకారులు, మహిళలు, చిన్నారుల వివరాలను అందజేయాలని తెలిపారు. రెవారీ నుంచి […]

Update: 2021-02-02 11:19 GMT

న్యూఢిల్లీ: పంజాబ్, హర్యానాల నుంచి రైతులు ఢిల్లీకి రాకుండా అడ్డుకోవాలని ఢిల్లీ పోలీసులు లేఖ రాశారు. ఢిల్లీలో ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్నాయని రెండు రాష్ట్రాల డీజీపీలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. జనవరి 26న శాంతి భద్రతలు సమస్య ఎదురైందని, వారిని ఢిల్లీకి అనుమతిస్తే అలాంటి పరిస్థితులే పునరావృతమయ్యే ముప్పు ఉన్నదని హెచ్చరించారు. కాబట్టి వారిని ఆయా రాష్ట్రాలు వీడకుండా అడ్డుకోవాలని సూచించారు. అలాగే, ఢిల్లీకి వస్తున్న ఆందోళనకారులు, మహిళలు, చిన్నారుల వివరాలను అందజేయాలని తెలిపారు. రెవారీ నుంచి 300 మంది రైతులు ఢిల్లీకి బయల్దేరిన ట్రైన్ దారి మళ్లిందని, అనంతరం వారు ఇతర రవాణా మార్గాల్లో ఢిల్లీకి ప్రయాణమవుతున్నారని వివరించారు.

Tags:    

Similar News