'రండీ.. కానీ, ఎంజాయ్ కోసమైతే వద్దు'
పనాజీ: కరోనా భయాల నేపథ్యంలో.. గోవా పర్యటనకు వచ్చే సందర్శకులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. నెల రోజుల తర్వాత మళ్లీ కొత్త కేసులు నమోదవుతున్న సందర్భంలో.. రాష్ట్రంలోకి అవసరముంటేనే రావాలని.. కేవలం ఎంజాయ్ కోసం రావొద్దని సీఎం ప్రమోద్ సావంత్ పర్యాటకులకు సూచించారు. అంతేకాదు, ఈ నెల 12న మొదలైన ప్రత్యేక ట్రైన్‌లు గోవాలోని మడగావ్ స్టాప్‌లో ఆగడంపైనా అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేక ట్రైన్‌లో మడగావ్‌లో దిగేందుకు టికెట్ బుక్ చేసుకున్న 720 […]
పనాజీ: కరోనా భయాల నేపథ్యంలో.. గోవా పర్యటనకు వచ్చే సందర్శకులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. నెల రోజుల తర్వాత మళ్లీ కొత్త కేసులు నమోదవుతున్న సందర్భంలో.. రాష్ట్రంలోకి అవసరముంటేనే రావాలని.. కేవలం ఎంజాయ్ కోసం రావొద్దని సీఎం ప్రమోద్ సావంత్ పర్యాటకులకు సూచించారు. అంతేకాదు, ఈ నెల 12న మొదలైన ప్రత్యేక ట్రైన్‌లు గోవాలోని మడగావ్ స్టాప్‌లో ఆగడంపైనా అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేక ట్రైన్‌లో మడగావ్‌లో దిగేందుకు టికెట్ బుక్ చేసుకున్న 720 మందిలో చాలా వరకు స్వరాష్ట్రీయులు కాదని అన్నారు. వారందరినీ టెస్ట్ చేయాల్సి ఉంటుందని, గోవాకు చెందనివారైనా 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రత్యేక ట్రైన్‌లు మడగావ్‌లో ఆగొద్దని రైల్వే శాఖకు గోవా ప్రభుత్వం గురువారం విజ్ఞప్తి చేయడం గమనార్హం. అయితే, అటువంటి విజ్ఞప్తులేమీ తమకు అందలేని కొంకణ్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు.