కరోనా బారిన పడొద్దు: సీపీ జోయల్ డేవిడ్

దిశ ప్రతినిధి, మెదక్: పోలీసులు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ జోయల్ డేవిస్ సూచించారు. బుధవారం గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ ఏసీపీ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని అధికారులతో కేసుల పురోగతిపై సమీక్షించి మాట్లాడారు. ఠాణాలకు వచ్చే వారికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేపట్టాలని, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలన్నారు. కేసుల పరిశోధనలో భాగంగా ఇతర ప్రదేశాలకు వెళ్లే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం ఠాణాల వారిగా కేసుల పురోగతి గురించి తెలుసుకున్నారు. బహిరంగ […]

Update: 2020-06-17 03:49 GMT

దిశ ప్రతినిధి, మెదక్: పోలీసులు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ జోయల్ డేవిస్ సూచించారు. బుధవారం గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ ఏసీపీ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని అధికారులతో కేసుల పురోగతిపై సమీక్షించి మాట్లాడారు. ఠాణాలకు వచ్చే వారికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేపట్టాలని, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలన్నారు. కేసుల పరిశోధనలో భాగంగా ఇతర ప్రదేశాలకు వెళ్లే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం ఠాణాల వారిగా కేసుల పురోగతి గురించి తెలుసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై కేసులు నమోదు చేయాలని స్పష్టంచేశారు. పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ నారాయణ పాల్గొన్నారు.

Tags:    

Similar News