దాతలు ముందస్తు సమాచారం ఇవ్వాలి
దిశ, మెదక్: లాక్‌డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు నిత్యావసరాలను పంపిణీ చేయాలనుకునే వారు ముందుగా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి కోరారు. పలు సంస్థలు చేస్తున్న వితరణ సమాజ హితం కోసమే అయినప్పటికీ కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. దాతలు ముందుగా సమాచారం ఇచ్చినట్లయితే పేద ప్రజలు సామాజిక దూరం పాటించడానికి తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. తప్పుడు సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం […]
దిశ, మెదక్: లాక్‌డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు నిత్యావసరాలను పంపిణీ చేయాలనుకునే వారు ముందుగా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి కోరారు. పలు సంస్థలు చేస్తున్న వితరణ సమాజ హితం కోసమే అయినప్పటికీ కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. దాతలు ముందుగా సమాచారం ఇచ్చినట్లయితే పేద ప్రజలు సామాజిక దూరం పాటించడానికి తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. తప్పుడు సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.
Tags: sangareddy sp chandrasekhar reddy, donors, medak news