ట్రంప్ ఖాతాపై ట్విట్టర్ శాశ్వత నిషేధం
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ట్విట్టర్ షాక్ ఇచ్చింది. ట్రంప్ ఖాతాను శాశ్వతంగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఆయన తన సందేశాల ద్వారా హింసను మరింత ప్రేరేపించేలా ప్రమాదం ఉందని ప్రేరేపించింది. ఇటీవల ఆయన చేసిన ట్వీట్లను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్ వెల్లడించింది. క్యాపిటల్ భవనంపై దాడి తర్వాత ట్రంప్ ఖాతాలను 12 గంటల పాటు నిలిపివేస్తున్నట్లు ట్విట్టర్, ఫేస్‌బుక్ ప్రకటించాయి. ట్రంప్ పోస్టు చేసిన మూడు ట్వీట్లను నిలిపివేసింది. జో […]
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ట్విట్టర్ షాక్ ఇచ్చింది. ట్రంప్ ఖాతాను శాశ్వతంగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఆయన తన సందేశాల ద్వారా హింసను మరింత ప్రేరేపించేలా ప్రమాదం ఉందని ప్రేరేపించింది. ఇటీవల ఆయన చేసిన ట్వీట్లను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్ వెల్లడించింది.
క్యాపిటల్ భవనంపై దాడి తర్వాత ట్రంప్ ఖాతాలను 12 గంటల పాటు నిలిపివేస్తున్నట్లు ట్విట్టర్, ఫేస్‌బుక్ ప్రకటించాయి. ట్రంప్ పోస్టు చేసిన మూడు ట్వీట్లను నిలిపివేసింది. జో బైడెన్ బాధ్యతలు స్వీకరించే రోజు వరకు ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను నిలిపివేస్తున్నట్లు మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. తాజాగా ట్విట్టర్ శాశ్వత నిషేధాన్ని విధించింది.