బాలీవుడ్ సినిమాలను మెచ్చిన ట్రంప్

యూఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా గుజరాత్ అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్… భారతదేశ ఆచారవ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాల గురించి తన ప్రసంగంలో ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలు, బాంగ్రా డ్యాన్స్‌పై ప్రత్యేకంగా కాంప్లిమెంట్స్ ఇచ్చిన ట్రంప్… ప్రపంచం మొత్తం షారుక్ ఖాన్ – కరణ్ జోహార్ కాంబినేషన్‌లో వచ్చిన రొమాంటిక్ ‘ఫిల్మ్ దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’, అమితాబ్ బచ్చన్ – ధర్మేంద్ర […]

Update: 2020-02-24 07:03 GMT

యూఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా గుజరాత్ అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్… భారతదేశ ఆచారవ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాల గురించి తన ప్రసంగంలో ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలు, బాంగ్రా డ్యాన్స్‌పై ప్రత్యేకంగా కాంప్లిమెంట్స్ ఇచ్చిన ట్రంప్… ప్రపంచం మొత్తం షారుక్ ఖాన్ – కరణ్ జోహార్ కాంబినేషన్‌లో వచ్చిన రొమాంటిక్ ‘ఫిల్మ్ దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’, అమితాబ్ బచ్చన్ – ధర్మేంద్ర యాక్షన్ ఎంటర్టైనర్ ‘షోలే’ సినిమాలను చూసేందుకు ఇష్టపడుతుందని తెలిపారు. భారత్ పర్యటనకు ముందు కూడా ఇండియన్ సినిమాలపై స్పెషల్‌గా మెన్షన్ చేస్తూ వచ్చారు ట్రంప్. ఆయుష్మాన్ ఖురాన్ లీడ్ రోల్‌లో వచ్చిన ‘శుభమంగళ్ జ్యాదా సావధాన్’ సినిమాపై గ్రేట్ అంటూ ట్వీట్ చేశారు కూడా. కాగా.. బాహుబలి చిత్రంలో ప్రభాస్ ఫేస్‌ను మార్ఫ్ చేసి ట్రంప్ ఫేస్‌ను యాడ్ చేసిన అభిమానులు… ట్రంప్ శత్రువులను చీల్చిచెండాతున్నట్లు వీడియో తయారు చేశారు. ఈ వీడియోపై కూడా ట్వీట్ చేశారు ట్రంప్. ఇండియాలోని తన స్నేహితులను కలుసుకునేందుకు ఆత్రుతగా ఉంది అంటూ పోస్ట్ పెట్టాడు.

ఇండియన్ సినిమాకు ట్రంప్‌కు మధ్య అనుబంధం ఇలా ఉండగా … షారుక్ అభిమానులు ఓ రేంజ్‌లో ఖుషీ అవుతున్నారు. 2015లో భారత్‌లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన స్పీచ్‌లో దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే డైలాగ్ చెప్పగా.. ఇప్పుడు ట్రంప్ సైతం ఈ సినిమా గురించి ప్రస్తావించడంపై పండుగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. షారుక్ వల్డ్స్ బిగ్గెస్ట్ స్టార్ అని.. ఫేస్ ఆఫ్ ద బాలీవుడ్ బాద్ షా అని సంబురపడి పోతున్నారు. కాగా ట్రంప్ స్పీచ్ తర్వాత సోషల్ మీడియాలో దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే (DDL) ట్రెండింగ్‌లో ఉంది.

Read Also..

మొతెరాలో ‘నమో’స్తే ట్రంప్

Full View

Tags:    

Similar News