TG Assembly: అలస్యంగా ప్రారంభమైన అసెంబ్లీ.. హరీశ్‌రావు హాట్ కామెంట్స్
ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు (Assembly Sessions) పది నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం అయ్యాయి.
దిశ, వెబ్‌డెస్క్: ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు (Assembly Sessions) పది నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలోనే విపక్ష బీఆర్ఎస్ సభ్యుడు, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సభ సమయ పాలనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ ఉదయం10.10కి సభ ప్రారంభమైందని, ఈ సెషన్‌లో ఏ ఒక్కరోజు కూడా సరైన సమయానికి సభ మొదలు కాలేదని కామెంట్ చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో సరైన సమయానికి సభ ప్రారంభమయ్యేదని.. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన మనమే ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదని హరీశ్ రావు, స్పీకర్‌కు తెలిపారు.