ఎక్కువ కేసులు ఉత్తరాఖండ్ నుంచే!
లాక్‌డౌన్ కారణంగా గృహహింస కేసులు అధికంగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుల్లో ఉత్తరాఖండ్, హర్యానా రాష్ట్రాలు మొదటి స్థానంలో ఉన్నట్లు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) తెలిపింది. దేశవ్యాప్తంగా మొత్తం 727 కేసులు నమోదు కాగా, వాటిలో ఉత్తరాఖండ్ నుంచి 144, హర్యానా నుంచి 79, ఢిల్లీ నుంచి 63 కేసులు వెలుగు చూశాయి. దక్షిణ భారతదేశంలో కేరళ నుంచి 18 కేసులు నమోదుకాగా, అతి తక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క కేసు […]
లాక్‌డౌన్ కారణంగా గృహహింస కేసులు అధికంగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుల్లో ఉత్తరాఖండ్, హర్యానా రాష్ట్రాలు మొదటి స్థానంలో ఉన్నట్లు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) తెలిపింది. దేశవ్యాప్తంగా మొత్తం 727 కేసులు నమోదు కాగా, వాటిలో ఉత్తరాఖండ్ నుంచి 144, హర్యానా నుంచి 79, ఢిల్లీ నుంచి 63 కేసులు వెలుగు చూశాయి. దక్షిణ భారతదేశంలో కేరళ నుంచి 18 కేసులు నమోదుకాగా, అతి తక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క కేసు నమోదైంది. కేంద్రపాలిత ప్రాంతాలైన దాద్రానగర్ హవేలీ, డామన్, పుదుచ్చేరీ, అలాగే జార్ఖండ్, కర్ణాటక, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ఇదిలా ఉండగా, ఎనిమిది రాష్ట్రాలు ఈ వివరాల గురించి నివేదికలు పంపించలేదని తెలిసింది.