ఆర్జీఐలో ‘డొమెస్టిక్ డిపార్చర్స్ ప్లాజా ప్రీమియం లాంజ్‌’

దిశ, రాజేంద్రనగర్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నూతన, పునరుద్దరించిన ప్లాజా ప్రీమియం లాంజ్‌ను ఎయిర్‌పోర్ట్ సీఈఓ ప్రదీప్ పణికర్ మంగళవారం ప్రారంభించారు. డొమెస్టిక్ డిపార్చర్స్ విభాగంలో ఉన్న ఈ లాంజ్ 773 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ 222 మంది ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ప్లాజా ప్రీమియం లాంజ్‌లో ప్రయాణికుల కోసం వర్క్ స్టేషన్లు, వై-ఫై, ప్రత్యేక అతిథులు, వీఐపీల కోసం ప్రైవేట్ సీటింగ్ జోన్, లాంజ్ సీటింగ్ మొదలైనవి ఏర్పాటు చేశారు. ప్రీమియం ప్లాజా […]

Update: 2021-01-19 09:26 GMT

దిశ, రాజేంద్రనగర్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నూతన, పునరుద్దరించిన ప్లాజా ప్రీమియం లాంజ్‌ను ఎయిర్‌పోర్ట్ సీఈఓ ప్రదీప్ పణికర్ మంగళవారం ప్రారంభించారు. డొమెస్టిక్ డిపార్చర్స్ విభాగంలో ఉన్న ఈ లాంజ్ 773 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ 222 మంది ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ప్లాజా ప్రీమియం లాంజ్‌లో ప్రయాణికుల కోసం వర్క్ స్టేషన్లు, వై-ఫై, ప్రత్యేక అతిథులు, వీఐపీల కోసం ప్రైవేట్ సీటింగ్ జోన్, లాంజ్ సీటింగ్ మొదలైనవి ఏర్పాటు చేశారు. ప్రీమియం ప్లాజా లాంజ్‌లోని రెక్లైనర్ సీట్లలో కూర్చుని విమానాశ్రయ రన్‌వే సుందర దృశ్యాలను వీక్చించవచ్చు. ప్రయాణికుల కోసం లాంజ్‌లో విస్తృతమైన బఫే ఏర్పాటు చేసారు. లాంజ్‌లో ఏర్పాటు చేసిన అనేక స్క్రీన్‌ల ద్వారా ప్రయాణీకులు తమ విమాన షెడ్యూల్‌ అప్‌డేట్ సమాచారాన్ని పొందవచ్చు.

Tags:    

Similar News