గ్యాస్ ప్రాబ్లమా.. ఇలా తగ్గించుకోండి

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం మంది గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు. ఆయిల్ పదార్థాలు ఎక్కువగా వాడటం, టైమ్‌కు సరిగా తినకపోవడం మూలంగా ఈ గ్యాస్ ప్రాబ్లమ్ ఏర్పడుతుంది. వయస్సుతో సంబంధం లేకుండా అన్ని రకాల వయస్సున్న వారికీ, ప్రస్తుతం ఈ సమస్య ఏర్పడుతుంది. మరీ ముఖ్యంగా నమలడం అనే ప్రక్రియ వలన మన శరీరంలోకి గ్యాస్ చేరుతూ ఉంటుంది. కార్బొనేటెడ్ పానీయాల వల్ల కూడా గ్యాస్ పెరుగుతుంది. చిన్న పేగులలో బ్యాక్టీరియా కావలసినదానికన్నా […]

Update: 2020-10-24 00:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం మంది గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు. ఆయిల్ పదార్థాలు ఎక్కువగా వాడటం, టైమ్‌కు సరిగా తినకపోవడం మూలంగా ఈ గ్యాస్ ప్రాబ్లమ్ ఏర్పడుతుంది. వయస్సుతో సంబంధం లేకుండా అన్ని రకాల వయస్సున్న వారికీ, ప్రస్తుతం ఈ సమస్య ఏర్పడుతుంది. మరీ ముఖ్యంగా నమలడం అనే ప్రక్రియ వలన మన శరీరంలోకి గ్యాస్ చేరుతూ ఉంటుంది. కార్బొనేటెడ్ పానీయాల వల్ల కూడా గ్యాస్ పెరుగుతుంది. చిన్న పేగులలో బ్యాక్టీరియా కావలసినదానికన్నా ఎక్కువ పెరగడం కూడా దీనికి కారణం. టైప్-2 డయాబెటిస్, సెలియాక్ లేదా కాలేయానికి సంబంధించిన వ్యాధుల వలన ఈ బ్యాక్టీరియా పెరుగుతుంది. పూర్తిగా జీర్ణం కాని కార్బోహైడ్రేట్స్ వలన ఈ గ్యాస్ తయారవుతుంది. చిన్న ప్రేగుల్లోకి చేరిన ఆహారం మొత్తం జీర్ణం కాకుండా పూర్తిగా ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ జీర్ణం కాని కార్బోహైడ్రేడ్స్ మలద్వారం లేదా కొలోన్‌కు చేరుతుంది. అక్కడ బ్యాక్టీరియా దీన్ని హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్‌గా మారుస్తుంది.

ఉద్యోగం చేసే వారు పనిఒత్తిడిలో భాగంగా సమయానికి తినే టైమ్ ఉండదు. ఎక్కువగా ప్రయాణాలు చేయడం, శారీరక శ్రమ లేకపోవడం మూలంగా ఈ సమస్య ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఒక్కోసారి ఈ గ్యాస్ ఛాతీలోకి చేరిపోతుంటుంది. తద్వారా ఛాతీ పట్టేసినట్టు ఉండడం, నొప్పి లాంటివి కలుగుతాయి. మద్యం అలావాటు ఉన్నవారికి, సోడా, బీర్ లాంటి కార్బొనేటెడ్ పానీయాలలోని గాలి బుడగలు శరీరంలో చేరి అపానవాయువుగా మారతాయి. ఎక్కువ సిగరెట్ తాగడం కూడా గ్యాస్ పెరగడానికి ఒక కారణం. ఈ అలవాటు ఉన్నవారికి మలబద్దకం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల అపానవాయువు పెరిగే అవకాశాలుంటాయి.

అయితే ఈ గ్యాస్ ప్రాబ్లమ్ నుంచి బయటపడాలంటే ఎక్కువగా ఫ్రూట్స్ తినాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజూ దానిమ్మ గింజల రసం 50 గ్రాములు, వాము 100 గ్రాములు, 50 గ్రాముల నల్ల ఉప్పు వీటన్నిటిని కలిపి ఒక పొడి పదార్థంగా తయారు చేసుకొని, రోజూ భోజనం చేసిన తర్వాత ఒక చెంచా తిని, ఆ తర్వాత గోరు వెచ్చని నీరు తాగాలి. రోజూ ఈ విధంగా క్రమం తప్పకుండా పాటిస్తే… కడుపునొప్పి, గ్యాస్ ప్రాబ్లబ్, పొట్ట ఉబ్బడం, అజీర్తి సమస్యలు తగ్గుతాయి. అంతేగాకుండా డైట్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలని డాక్టర్లు సూచిస్తున్నారు. మద్యానికి బదులు వైన్ తాగడం మంచిదని సూచించారు.

Tags:    

Similar News