ఆమెను ఇంట్లో ఉండమని చెప్తే ఊరంతా తిరిగింది!

దిశ, రంగారెడ్డి: నిన్నటి వరకు ఆ గ్రామంలో అందరూ ఆనందంగా గడిపారు. పక్కింటి వాళ్లతో మాట్లాడారు. ఉపాధి హామీ పనికి కూడా వెళ్లారు. కానీ, ఈరోజు అన్ని బంద్… ఇంట్లో నుంచి బయటకి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకోక తప్పదు అనే పరిస్థితి వచ్చింది. కారణం అన్నీ తెలిసినా ఆ నర్సుతో పాటు గ్రామస్తుల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తోన్నది. ఆమె నీలోఫర్ ఆసుపత్రిలో ఒక మహిళకు కరోనా సోకిందని తెలియక ఆమెకు ట్రీట్మెంట్ చేశారని తెలుస్తోన్నది. […]

Update: 2020-04-28 06:32 GMT

దిశ, రంగారెడ్డి: నిన్నటి వరకు ఆ గ్రామంలో అందరూ ఆనందంగా గడిపారు. పక్కింటి వాళ్లతో మాట్లాడారు. ఉపాధి హామీ పనికి కూడా వెళ్లారు. కానీ, ఈరోజు అన్ని బంద్… ఇంట్లో నుంచి బయటకి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకోక తప్పదు అనే పరిస్థితి వచ్చింది. కారణం అన్నీ తెలిసినా ఆ నర్సుతో పాటు గ్రామస్తుల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తోన్నది. ఆమె నీలోఫర్ ఆసుపత్రిలో ఒక మహిళకు కరోనా సోకిందని తెలియక ఆమెకు ట్రీట్మెంట్ చేశారని తెలుస్తోన్నది. వెంటనే అప్రమత్తమైన డాక్టర్లు.. ఆమెకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది నుంచి నమూనాలను సేకరించారు. ఆ తర్వాత వీరందిరికీ హైదరాబాద్ లోని మీ ఇంట్లోనే ఉండండి.. ఎక్కడికి వెళ్లొద్దని చెప్పారు. కానీ, ఆ మహిళ మాత్రం సొంత గ్రామానికి వచ్చింది. ఇప్పుడు ఆమెతో పాటు ఆమె పిల్లలకు కూడా కరోనా సోకింది. ఆ పిల్లలు ఎవరెవరితో ఆడుకున్నారో.. ఆమెతో పాటు, ఆమె భర్త ఎంత మందిని కలిశాడో తెలియని పరిస్థితి. ఇప్పుడు ఆ గ్రామ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి..? ఈ ఘటనతో రాష్ట్రంలో కరోనా గ్రామాలకు కూడా పాకింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతోన్నది. ఇప్పటికైనా నిర్లక్ష్యం వద్దు.. అందరం జాగ్రత్తలు పాటిద్దాం.

tags: Rangareddy, Nurse, Coronavirus, Treatment, Nilofer Hospital, Doctors, Hometown, Hyderabad

Tags:    

Similar News