దుబ్బాకలో వెనువెంటనే రెండు విషాదాలు.. షాక్‌లో స్థానికులు
దిశ, దుబ్బాక : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ వద్ద తీవ్ర విషాద దుర్ఘటన జరిగింది. భూంపల్లి – చిట్టాపూర్ మధ్య ప్రధాన రహదారి పక్కన కారు అదుపు తప్పి బావిలో పడిపోయింది. ఏసీపీ చల్లా దేవారెడ్డి ఆధ్వర్యంలో అన్ని శాఖలకు చెందిన అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని 5 గంటల పాటు ప్రయత్నం చేసి కారును బయటకు తీశారు. అయితే, కారును బయటకు తీసే క్రమంలో మరో విషాదం నెలకొంది. సుమారు 2 గంటల […]
దిశ, దుబ్బాక : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ వద్ద తీవ్ర విషాద దుర్ఘటన జరిగింది. భూంపల్లి – చిట్టాపూర్ మధ్య ప్రధాన రహదారి పక్కన కారు అదుపు తప్పి బావిలో పడిపోయింది. ఏసీపీ చల్లా దేవారెడ్డి ఆధ్వర్యంలో అన్ని శాఖలకు చెందిన అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని 5 గంటల పాటు ప్రయత్నం చేసి కారును బయటకు తీశారు. అయితే, కారును బయటకు తీసే క్రమంలో మరో విషాదం నెలకొంది. సుమారు 2 గంటల పాటు ప్రయత్నం చేసిన గజ ఈతగాడు, దుబ్బాక మండలం ఎనగుర్తి గ్రామానికి చెందిన నర్సింహులు అనే వ్యక్తి మృతిచెందాడు. బావి నుంచి కారుతో సహా ఇద్దరు సూదనం ప్రశాంత్ (26) తల్లి భాగ్యలక్ష్మీ(50) శవాలను బయటకు తీస్తుండగా కారుకు తాడు కట్టిన నర్సింలు అందులో ఇరుక్కుని అదే కారు పైన పైదాకా వచ్చి జారి మళ్లీ బావిలో పడటంతో ఈ ఘటన జరిగింది.
కారుతో పాటు బావిలోంచి తీసిన మృతదేహాలను మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. నందిగామ నుంచి హుస్నాబాద్ మండలం నందరం గ్రామంలో వాళ్ళ బంధువుల ఇంట్లో జరిగే ఫంక్షన్ వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు, బంధువులు తెలిపారు. విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కారు లోంచి వెలికి తీసిన ఇద్దరి మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి తరలించగా, గజ ఈతగాడు నర్సింలు మృతదేహం మాత్రం బావిలో ఉండగానే బంధువులు, గ్రామస్తులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఏసీపీ చల్లా దేవారెడ్డి డౌన్ డౌన్ అంటూ బైఠాయించారు. మృతుడి కుటుంబానికి తక్షణమే న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు సైతం ఘటనా స్థలికి రావాలని డిమాండ్ చేశారు.