హైదరాబాద్ ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగంలో భారీ మోసం
తెలంగాణలో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం(Hyderabad Income Tax Department) అధికారులు సీబీఐ(CBI) వలకు చిక్కారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం(Hyderabad Income Tax Department) అధికారులు సీబీఐ(CBI) వలకు చిక్కారు. పన్ను చెల్లించే వారిని టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. మొత్తం ఆరుగురు అధికారులపై కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఇద్దరు ఐటీ ఇన్స్‌పెక్టర్లు(IT Inspectors), ముగ్గరు ట్యాక్స్ అసిస్టెంట్లు, ఒక ప్రయివేట్ వ్యక్తి ఉన్నట్లు సమాచారం. వెంటనే వారి వివరాలు తెప్పించుకొని ఇళ్లలో సోదాలు చేశారు. ఏకకాలంలో నగరంలోని ఆరు చోట్ల విస్తృతంగా సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. ట్యాక్స్ పేయర్లు(Tax Payers) అప్రమత్తంగా ఉండాలని ఇన్‌కమ్ ట్యాక్స్ (Income Tax) విభాగం అలర్ట్ చేసింది. అధికారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. అధికారులతో పాటు ఫేక్ ఫోన్ కాల్స్, సొషల్ మీడియాల ద్వారా వచ్చే మెసేజ్‌లు, మొబైల్ సందేశాల పట్ల అప్రమత్తత వహించాలని కోరింది. అలాంటి సందేశాలు వచ్చినప్పుడు గుడ్డిగా నమ్మి మోసపోవద్దని, అధికారిక ఛానళ్ల ద్వారా వెరిఫై చేసుకోవాలని మరోసారి హెచ్చరికలు చేసింది.