Pak army: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. నలుగురు చొరబాటుదారులు హతం

భారత్‌-పాక్ సరిహద్దుల్లో (India pak border) ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. పాకిస్థాన్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మంగళవారం ఉల్లంఘించింది.

Update: 2025-04-02 06:34 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌-పాక్ సరిహద్దుల్లో (India pak border) ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. పాకిస్థాన్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మంగళవారం ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద (LOC) వద్ద పాక్‌ ఆర్మీ చొరబాట్లకు పాల్పడింది. దాయాది దేశానికి భారత సైన్యం దీటుగా జవాబిచ్చింది. ప్రతీకార కాల్పుల్లో 4-5 మంది చొరబాటుదారులను హతమార్చినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. పూంచ్ జిల్లాలోని కృష్ణ ఘాటి ప్రాంతంలో చొరబాటు యత్నాన్ని తిప్పికొట్టినట్లు పేర్కొంది. ‘‘ఏప్రిల్ 1న కృష్ణ ఘాటి సెక్టార్‌ వద్ద పాక్‌ ఆర్మీ చొరబాట్లకు పాల్పడింది. దాంతో అక్కడ మందుపాతర పేలింది. తర్వాత పాక్‌ సైన్యం కాల్పులు జరిపి, ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ ఘటనపై మా ఆర్మీ దీటుగా బదులిచ్చింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది’’ అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

రెండు నెలలుగా ఉద్రిక్తతలు..

గత రెండు నెలలుగా దక్షిణ పీర్ పంజాల్ ప్రాంతంలో సరిహద్దుల్లో ఎల్‌ఓసి వెంబడి కాల్పుల ఘటనలు గణనీయంగా పెరిగాయి. పాకిస్థాన్ స్నిపింగ్, కాల్పులు, బోర్డర్ యాక్షన్ టీం (BAT) ప్రయత్నాలు చేసినట్లు నివేదికలు వెల్లడయ్యాయి. పాక్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నాయని.. వాటిని సమర్థంగా ఎదుర్కొంటున్నామని భారత సైన్యం తెలిపింది. ఆర్మీ వర్గాల ప్రకారం.. పాకిస్థాన్ దళాలు, ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్‌లోని కృష్ణ ఘాటి సెక్టార్‌లో అనేకసార్లు విఫల చొరబాటు ప్రయత్నాలు చేశాయి. ఈ దారుణంలో భారీ నష్టాలను చవిచూశారు. ఫిబ్రవరి మొదటి వారంలో పాక్ దళాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. ఎల్ఓసీ వెంబడి పేలుడు పదార్థాలను పేల్చాయి. దీనితో భారత సైన్యం ప్రతీకార చర్యకు దిగింది. భారతదేశం ఈ సమస్యను లేవనెత్తినప్పటికీ.. సరిహద్దులో కవ్వింపులు కొనసాగుతూనే ఉన్నాయి.

Tags:    

Similar News