కామన్ హెయిర్ మిస్టేక్స్ ఏంటో తెలుసా?

దిశ, వెబ్ డెస్క్: కాస్త జుట్టు రాలిపోతే చాలు.. కొందరు ఏదో కోల్పోయినట్లు బాధపడుతుంటారు. మరికొందరైతే హెయిర్ బ్రేక్ అయితేనే మనసు ముక్కలైనట్లు ఫీలవుతుంటారు. ప్రత్యేకించి యవతీయువకులకు ‘జుట్టు’పై ఉండే ప్రేమ అంతా ఇంతా కాదు. అయితే జుట్టు చివర్లు చిట్లిపోవడానికి మనం రోజూ చేసే కొన్ని కామన్ మిస్టేక్స్ కారణంగా నిలుస్తున్నాయి. ప్రతిరోజు తలస్నానం : ప్రతిరోజు హెయిర్‌కు షాంపూ అప్లయ్ చేయడం వల్ల.. తలలో నేచురల్ ఆయిల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ ఆయిల్స్ వల్ల […]

Update: 2020-06-09 01:36 GMT

దిశ, వెబ్ డెస్క్: కాస్త జుట్టు రాలిపోతే చాలు.. కొందరు ఏదో కోల్పోయినట్లు బాధపడుతుంటారు. మరికొందరైతే హెయిర్ బ్రేక్ అయితేనే మనసు ముక్కలైనట్లు ఫీలవుతుంటారు. ప్రత్యేకించి యవతీయువకులకు ‘జుట్టు’పై ఉండే ప్రేమ అంతా ఇంతా కాదు. అయితే జుట్టు చివర్లు చిట్లిపోవడానికి మనం రోజూ చేసే కొన్ని కామన్ మిస్టేక్స్ కారణంగా నిలుస్తున్నాయి.

ప్రతిరోజు తలస్నానం :

ప్రతిరోజు హెయిర్‌కు షాంపూ అప్లయ్ చేయడం వల్ల.. తలలో నేచురల్ ఆయిల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ ఆయిల్స్ వల్ల హెయిర్ కొంతవరకు బ్రేకేజ్ అవుతుంది. స్కాల్ప్ టైప్‌ను బట్టి వారంలో మూడు, నాలుగు రోజులకోసారి హెడ్ బాత్ చేయడమే బెటర్.

కండిషనర్ ఎక్కువగా అప్లయ్ చేయడం :

కొందరు తరుచుగా కండిషనర్ పెడుతుంటారు. అంతేకాకుండా దాన్ని కూడా షాంపూలానే అప్లయ్ చేస్తుంటారు. అలా కాకుండా, జస్ట్ హెయిర్ చివర్లో పెట్టాలి. స్కాల్ప్ ఏరియాలో అప్లయ్ చేస్తే.. హెయిర్ గ్రీసీగా మారుతుంది. అందుకే ఎక్కువ సార్లు కూడా కండిషనర్ పెట్టుకోకూడదు.

వేడినీళ్లతో :

సమ్మర్‌లో కాకుండా వింటర్, రెయినీ సీజన్‌లోనూ చాలామంది హాట్ వాటర్‌తో స్నానం చేస్తుంటారు. కానీ వేడినీళ్లు జుట్టును పాడు చేస్తాయి. దీనివల్ల నేచురల్ ఆయిల్స్‌తో పాటు, కెరటిన్ అధికంగా ఉత్పత్తి కావడంతో హెయిర్ షైన్ తగ్గిపోతుంది.

తడిజుట్టును దువ్వితే..

ఆలస్యమవుతుందనో లేదా ఓపిక లేకనో చాలామంది తడిజుట్టును దువ్వుతుంటారు. దాని వల్ల హెయిర్ డ్యామేజ్ అవుతుంది. అంతేకాదు తడిజుట్టును ముడి వేసినా, పోనిటెయిల్ వేసినా హెయిర్ బ్రేకేజ్ జరగొచ్చు.

Tags:    

Similar News