సాల్ట్ థెరపీ గురించి తెలుసా..!
దిశ, వెబ్‌డెస్క్: ఆస్తమా, బ్రాంకైటిస్, సైనసైటిస్ వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే సాల్ట్ థెరపీ చేయించుకుంటే ఉపశమనం పొందుతారు. ఈ ఉప్పు థెరపీ ఏంటీ అనుకుంటున్నారా.. ఇది ఇప్పటిదేమీ కాదు. పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. శ్వాసకోశ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఈ సాల్ట్ థెరపీని ఉపయోగిస్తారు. దీనిని హలోథెరపీ లేదా స్పెలియోథెరపీ అని కూడా పిలుస్తారు. పోలాండ్‌కు చెందిన ఓ డాక్టర్ బోస్కో విన్ స్కీ మొదటిసారిగా ఉప్పు గుహాల్లో ఆరోగ్య ప్రయోజనాల కోసం […]
దిశ, వెబ్‌డెస్క్: ఆస్తమా, బ్రాంకైటిస్, సైనసైటిస్ వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే సాల్ట్ థెరపీ చేయించుకుంటే ఉపశమనం పొందుతారు. ఈ ఉప్పు థెరపీ ఏంటీ అనుకుంటున్నారా.. ఇది ఇప్పటిదేమీ కాదు. పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు.
శ్వాసకోశ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఈ సాల్ట్ థెరపీని ఉపయోగిస్తారు. దీనిని హలోథెరపీ లేదా స్పెలియోథెరపీ అని కూడా పిలుస్తారు. పోలాండ్‌కు చెందిన ఓ డాక్టర్ బోస్కో విన్ స్కీ మొదటిసారిగా ఉప్పు గుహాల్లో ఆరోగ్య ప్రయోజనాల కోసం పరిశోధనలు చేశాడు. ఉప్పు థెరపీతో ఆరోగ్యాన్ని ఎలా పొందవచ్చో తన పరిశోధనల ద్వారా నిరూపించాడు. సహజసిద్ధమైన ఉప్పు రోగ నిరోధకశక్తి పెంచడమే కాకుండా శ్వాసకోశ సమస్యలను పరిష్కరించేందుకు ఉపయోగపడుతోందని బోస్కో విన్ స్కీ తేల్చాడు. మందుల అవసరాన్ని తగ్గిస్తూ ఉబ్బసం ఉన్న పిల్లలకు మంచి చికిత్సగా ఈ ఉప్పు థెరపీని యురోపీయన్లు భావిస్తున్నారు.
ఉప్పు చికిత్స అనేది సహజమైన ఉప్పు గుహల్లో ఆరోగ్య సమయాన్ని గడిపే సాంప్రదాయంగా భావిస్తూ నేటికీ ఈ థెరపీని వినియోగిస్తున్నారు తూర్పు యూరోపియన్లు. సాల్ట్ థెరపీ సెంటర్లు బ్యూటీ పార్లర్లను తలపిస్తుంటాయి. ఆధునిక ఉప్పు గదులు సహజ ఉప్పు గనులను ప్రతిబింబిస్తాయి. ఉప్పు గదులు స్థిరమైన ఉష్ణోగ్రత, తేమ కలిగి ఉంటాయి. లోపలి గోడలు స్వచ్ఛమైన ఉప్పుతో కప్పి ఉంటాయి. ఉప్పు గుహల్లో విశ్రాంతి తీసుకునేటప్పుడు 1 నుంచి 10 మైక్రోమీటర్ల పరిమాణంలో ఉప్పు సూక్ష్మ కణాలు గదిలోకి విడుదలవుతాయి. దీంతో శ్వాస, ముక్కు, గొంతు, ఊపిరితిత్తులలోకి ప్రవేశించి చికిత్సను ప్రారంభిస్తారు. 5 మైక్రోమీటర్ల కంటే పెద్ద కణాలు ముక్కు, గొంతులోకి వెళతాయి. చిన్న కణాలు ఊపిరితిత్తులోకి వెళ్తాయి. దీంతో అలెర్జీలు, ఉబ్బసం, బ్రోన్కైటిస్, జలుబు, ఫ్లూ, సిస్టిక్ ఫైబ్రోసిస్, ఎంఫిసెమా, రినిటిస్, ముక్కు సంబంధిత ఇన్ఫెక్షన్లు, సైనసిటిస్ వంటి సమస్యలు దూరమవుతాయి.
విదేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న ఈ సాల్ట్ థెరపీ భారత్‌కు కూడా వచ్చింది. ముంబై, బెంగుళూరు తర్వాత ఇటీవల హైదరాబాద్‌లోనూ సాల్ట్ రూమ్స్ ప్రారంభమయ్యాయి. ఒకప్పుడు వృద్ధులు, చిన్నారులకే పరిమితమైన శ్వాసకోశ సమస్యలు ఇప్పుడు యువతలోనూ సాధారణమయ్యాయి. దీంతో ప్రత్యామ్నాయంగా సాల్ట్ రూమ్ థెరపీని వినియోగిస్తున్నారు. హెల్ జనరేటర్ మెషిన్ ద్వారా రూమ్‌లోకి సాల్ట్‌ను స్ప్రెడ్ చేస్తారు. దీంతో ఊపిరి పీల్చినప్పుడు ఉప్పుకణాలు లోపలికి ప్రవేశిస్తాయి. ఇది ఆహారంలో ఉపయోగించే సాల్ట్ లాంటిది కాదు కాబట్టి బీపీ ఉన్నప్పటికీ ఈ సాల్ట్ థెరపీకి అదేమీ అడ్డంకి కాదని నిర్వాహకులు తెలుపుతున్నారు. సాల్ట్ థెరపీ పూర్తి సహజమైందని.. శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఉపయోగపడుతోందని నిపుణులు చెబుతున్నారు. ఫిట్‌నెస్ ఇంట్రెస్ట్ అధికంగా ఉన్నవాళ్లు హై ఇంటెన్సిటీ వర్కవుట్ చేసి అలసిపోయిన శరీరం మళ్లీ తిరిగి యథాతధ స్థితికి రావడానికి ఇది ఉపకరిస్తుందని నిర్వాహకులు తెలిపారు.