‘ఫామ్ హౌస్‌లో ఉంటే.. ప్రజాస‌మ‌స్యలు తెలుస్తయా’

దిశ‌, వెంక‌టాపురం : ఫామ్ హౌస్‌కే ప‌రిమితమైన తెలంగాణ మ‌ఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజ‌ల స‌మ‌స్యలు ఎట్లా తెలుస్తయ్ అని, కాంగ్రెస్ పార్టీకి నాయ‌కుడే క‌రువ‌యిండ‌ని అన్న కేసీఆర్ కు ఇప్పుడు కేసీఆర్ ను గ‌ద్దె దింపే నాయ‌కుడు రేవంత్ రెడ్డి వ‌చ్చార‌ని భ‌ద్రాచ‌లం ఎమ్మెల్యే పొదెం వీర‌య్య హిత‌వు ప‌లికారు. సోమ‌వారం స్థానిక రోడ్లు భ‌వ‌నాల శాఖ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. పోయిన ఏడాది రైతుల‌కు రూ.25000 రుణమాఫీ ప్రక‌టించి […]

Update: 2021-09-20 05:06 GMT

దిశ‌, వెంక‌టాపురం : ఫామ్ హౌస్‌కే ప‌రిమితమైన తెలంగాణ మ‌ఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజ‌ల స‌మ‌స్యలు ఎట్లా తెలుస్తయ్ అని, కాంగ్రెస్ పార్టీకి నాయ‌కుడే క‌రువ‌యిండ‌ని అన్న కేసీఆర్ కు ఇప్పుడు కేసీఆర్ ను గ‌ద్దె దింపే నాయ‌కుడు రేవంత్ రెడ్డి వ‌చ్చార‌ని భ‌ద్రాచ‌లం ఎమ్మెల్యే పొదెం వీర‌య్య హిత‌వు ప‌లికారు. సోమ‌వారం స్థానిక రోడ్లు భ‌వ‌నాల శాఖ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. పోయిన ఏడాది రైతుల‌కు రూ.25000 రుణమాఫీ ప్రక‌టించి వెంక‌టాపురం మండ‌లంలో 600 మంది అర్హులుంటే 220 మందికి, ఈ ఏడాది రూ.50,000 రుణమాఫీ ఇస్తన‌ని ప్రక‌ట‌న‌లు ఇచ్చి 650 మందికి గాను వెంక‌టాపురంలోని మూడు బ్యాంకుల ద్వారా 60 మందిని ఎంపిక చేశార‌ని ఎద్దేవాచేశారు.

బ్యాంకు అధికారుల‌ను రుణ‌మాఫీ ఏద‌ని అడిగితే రూ.1900 కోట్ల రుణాలు ఉంటే రూ.130 కోట్లు చెల్లిస్తే రుణమాఫీ ఎలా జ‌రుగుతుంద‌ని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల‌కు 80 శాతం స‌బ్సిడీ పై వ్యవ‌సాయ ప‌రిక‌రాలు, విత్తనాలు అందిస్తే టీఆర్ఎస్ హ‌యాంలో పండించిన పంట‌ల‌కు గిట్టు బాటు ధర లేకపోగా ఎరువులు, పురుగుల మందుల ధ‌ర‌లు పెర‌గ‌డంతో రైతులు ఇబ్బందులు ప‌డుతున్న ప‌రిస్దితి నెల‌కొంద‌న్నారు. స‌న్న వ‌డ్లు కొనుగోలు చేయ‌మంటూ చేస్తున్న ప్రకటనలు మానుకోవాల‌న్నారు. ఖ‌రీఫ్, ర‌బీ వ‌రి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని గ్రామాల్లో ద‌ళిత బంధు అమ‌లు చేయ‌డంతో పాటు ఏజెన్సీ ప్రాంత దళితుల కుంటుబాల‌కు మూడెక‌రాల భూమి కేటాయించాల‌న్నారు.

ఈ నెల 24 నుంచి జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ స‌మావేశాల్లో ఏజెన్సీ స‌మ‌స్యలు ప్రస్తావిస్తాన‌న్నారు. ఈ నెల 27న అన్ని పార్టీలతో భార‌త్ బంద్ కు పిలుపునిచ్చామ‌న్నారు. దళిత‌, గిరిజ‌న యాత్ర విజ‌యవంతం అయింద‌న్నారు. రానున్న రెండు నెల‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ‌, ఉద్యోగుల స‌మ‌స్యలపై యాత్ర చేయ‌నున్నట్లు వెల్లడించారు. ఈ స‌మావేశంలో పీఏసీఏస్ అధ్యక్షులు చిడెం మోహ‌న్ రావు, ఎంపీపీ చెరుకూరి స‌తీష్‌, వైస్ ఎంపీపీ స‌య్యద్ హుస్సేన్‌, ఎంపీటీసీలు కొండ‌ప‌ర్తి సీతాదేవి, గార‌పాటి ర‌వి, మ‌న్యం సునీల్‌, చిడెం శివ‌, నాగేశ్వర‌రావు, ధ‌న‌ప‌నేని వెంక‌టేశ్వర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tags:    

Similar News