బ్లాక్‌చెయిన్ గురించి తెలుసా..? దానిని హ్యాకింగ్ చేయడం తేలికేనా..?
దిశ, వెబ్‌డెస్క్: బ్లాక్‌చెయిన్ అనేది వ్యాపార నెట్‌వర్క్‌లో లావాదేవీలను రికార్డ్ చేసే ప్రక్రియ. ఇది ఒక రకమైన DLT(డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ). దీనిలో లావాదేవీలు హ్యాష్ అని పిలువబడే మార్పులేని క్రిప్టోగ్రాఫిక్ సంతకంతో రికార్డ్ చేయబడుతుంది. చెయిన్‌లోని ఏదైనా ఒక బ్లాక్‌ను మార్చినట్లయితే, అది తారుమారు చేయబడిందని వెంటనే స్పష్టంగా తెలుస్తుంది. ఒకవేళ హ్యాకర్లు బ్లాక్‌చెయిన్ సిస్టమ్‌ను పాడుచేయాలనుకుంటే వారు చెయిన్‌లోని ప్రతి బ్లాక్‌ను మార్చవలసి ఉంటుంది. ఇలా అన్ని చెయిన్‌లను మార్చడం చాలా కష్టంతో కూడుకుంది. […]
దిశ, వెబ్‌డెస్క్: బ్లాక్‌చెయిన్ అనేది వ్యాపార నెట్‌వర్క్‌లో లావాదేవీలను రికార్డ్ చేసే ప్రక్రియ. ఇది ఒక రకమైన DLT(డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ). దీనిలో లావాదేవీలు హ్యాష్ అని పిలువబడే మార్పులేని క్రిప్టోగ్రాఫిక్ సంతకంతో రికార్డ్ చేయబడుతుంది. చెయిన్‌లోని ఏదైనా ఒక బ్లాక్‌ను మార్చినట్లయితే, అది తారుమారు చేయబడిందని వెంటనే స్పష్టంగా తెలుస్తుంది. ఒకవేళ హ్యాకర్లు బ్లాక్‌చెయిన్ సిస్టమ్‌ను పాడుచేయాలనుకుంటే వారు చెయిన్‌లోని ప్రతి బ్లాక్‌ను మార్చవలసి ఉంటుంది. ఇలా అన్ని చెయిన్‌లను మార్చడం చాలా కష్టంతో కూడుకుంది. అందుకే దీనిలో సమాచారం సురక్షితంగా ఉంటుంది.
బ్లాక్‌చెయిన్ సమాచారాన్ని చేరవేయడానికి చాలా అనువైనది. అనుమతి పొందిన నెట్‌వర్క్ సభ్యులు మాత్రమే యాక్సెస్ చేయగలరు. మార్పులేని లెడ్జర్‌లో సేవ్ చేయబడి తక్షణం, పూర్తిగా పారదర్శక సమాచారాన్ని అందిస్తుంది. ఇది ఆర్డర్‌లు, చెల్లింపులు, ఖాతాలు, ఉత్పత్తి మరెన్నో వాటిని ట్రాక్ చేయగలదు. లావాదేవీలకు సంబంధించిన అన్ని వివరాలు ఎండ్ టు ఎండ్ చూడగలరు.
బ్లాక్‌చెయిన్ రంగం రాను రాను చాలా అభివృద్ది చెందుతుంది. దీనిలో విప్లవాత్మకమైన సాంకేతిక మార్పులు వస్తున్నాయి. దీనిలోనే బ్లాక్‌చెయిన్ డెవలప్‌మెంట్ అనే కొత్త రంగం కూడా బాగా విస్తరిస్తోంది. ఇది టెక్ ఓత్సాహికులకు, డెవలపర్‌లకు ఎన్నో ఉద్యోగ అవకాశాలను అందిస్తోంది. బ్లాక్‌చెయిన్ డెవలపర్‌లలో రెండు రకాలు ఉన్నాయి. కోర్ బ్లాక్‌చెయిన్ డెవలపర్లు, బ్లాక్‌చెయిన్ సాఫ్ట్‌వేర్ డెవలపర్లు.
కోర్ బ్లాక్‌చెయిన్ డెవలపర్లు బ్లాక్‌చెయిన్ సిస్టమ్ డిజైన్, ఆర్కిటెక్చర్, భద్రతలో పాల్గోంటారు. బ్లాక్‌చెయిన్ సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, వీరికి ప్రత్యేకమైన పని ఉంటుంది. స్మార్ట్ కాంట్రాక్టుల అభివృద్ది, వివిధ అప్లికేషన్‌లు రూపొందిస్తారు. బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్‌గా ఉంటారు. 2017 క్రిప్టోకరెన్సీ బుల్ మార్కెట్ తర్వాత బ్లాక్‌చెయిన్ డెవలపర్‌లకు, ఇంజనీర్లకు డిమాండ్ పెరిగింది. డిజిటల్ ఇండియా నివేదిక ప్రకారం 2025 నాటికి ప్రధాన IT రంగాల్లో డిజిటల్ నైపుణ్యాలకు మరింత డిమాండ్ పెరుగుతుంది.
టెస్టింగ్, ప్లాట్‌ఫరమ్ టెక్నాలజీస్, జావా, క్లౌడ్ ఇన్‌ఫ్రా టెక్నాలజీస్, డేటా అనలిటిక్స్ వంటి డిజిటల్ స్కిల్స్‌కి ఇటీవల కాలంలో కొరత ఉంది. బ్లాక్‌చెయిన్ రంగంలో సంవత్సరానికి రూ.20లక్షల వరకు జీతంతో కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. సాధారణంగా అనుభవం ఉన్న బ్లాక్‌చెయిన్ డెవలపర్లకు సగటున ఏడాదికి జీతం రూ.82 లక్షల వరకు ఉంది. బ్లాక్‌చెయిన్ రూపకర్తలలో ఒకరైన ఆర్కిటెక్చర్‌కి సగటు జీతం ఏడాదికి రూ.80లక్షలు. ఇలాంటి అడ్వాన్సుడ్ టెక్నాలజీలను నేర్చుకోవడం వలన రానున్న రోజుల్లో బ్లాక్‌చెయిన్ రంగంలో మంచి ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు అని టెక్ విశ్లేషకులు అంటున్నారు.