టీ ఎక్కువగా తాగుతున్నారా..? అయితే ఇది మీ కోసమే..

దిశ, వెబ్‎డెస్క్ : చాలా మంది ప్రజలు ‘టీ’ తాగడం ద్వారా వారి రోజును ప్రారంభిస్తారు. ఆఫీసు పనులు లేదా ఇంటి పనులతో అలసట కలిగినా మొదట గుర్తొచ్చేది టీనే. ఒక వేడి వేడీ టీ తాగితే అప్పటివరకు ఉన్న ఒత్తిడి అంతా దూరమవుతోంది. ఇక చలికాలంలో అయితే పొగలు కక్కే టీ తాగితే ఆ మజానే వేరు. ఇంతగా అలవాటు అయినా ‘టీ’ ని మోతాదుకు మించి తాగితే ఆరోగ్యానికి మంచిదో కాదో తెలుసుకుందాం. ప్రతిరోజూ […]

Update: 2020-10-20 00:21 GMT

దిశ, వెబ్‎డెస్క్ : చాలా మంది ప్రజలు ‘టీ’ తాగడం ద్వారా వారి రోజును ప్రారంభిస్తారు. ఆఫీసు పనులు లేదా ఇంటి పనులతో అలసట కలిగినా మొదట గుర్తొచ్చేది టీనే. ఒక వేడి వేడీ టీ తాగితే అప్పటివరకు ఉన్న ఒత్తిడి అంతా దూరమవుతోంది. ఇక చలికాలంలో అయితే పొగలు కక్కే టీ తాగితే ఆ మజానే వేరు. ఇంతగా అలవాటు అయినా ‘టీ’ ని మోతాదుకు మించి తాగితే ఆరోగ్యానికి మంచిదో కాదో తెలుసుకుందాం.

ప్రతిరోజూ పరగడపున టీ తాగడం వల్ల పొట్టలో గ్యాస్టిక్ మ్యూకస్ ఏర్పడుతోందిది. దీంతో ఆకలి తగ్గిపోయి, ఎసిడిటికి కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. టీ ఆకుల్లో ఉండే ఆర్గానిక్ కాంపౌండ్లు ఐరన్ శోషించుకోవడాన్ని ఆపేస్తాయి. దీంతో టీ తాగే వారిలో ఐరన్ లోపాలు ఎక్కువగా కనబడుతాయి. ‘టీ’ లో కెఫిన్ ఎక్కువగా ఉండడం వల్ల నిద్రలేమి సమస్యలకు దారితీస్తుంది. కొన్ని పరిశోధనల్లో ఎక్కువగా టీ తాగేవారిలో నిద్రకు సహకరించే హోర్మోన్ మెలటోనిన్ ఉత్పత్తి తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఒకేసారి టీ ఎక్కువ రెండు, మూడు కప్పులు తాగితే కడుపు నొప్పి, తలనొప్పి, అజీర్ణం వంటివి వస్తాయని పరిశోధకులు తెలుపుతున్నారు. టీ మోతాదుకు మించి తాగితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని.. లిమిట్‎గా తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

 

Tags:    

Similar News