తెలిసీ తెలియని ఊహాగానాలొద్దు.. ప్రమాదంపై వాయుసేన కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: హెలికాప్టర్ ప్రమాదంపై పుకార్లు వస్తున్న నేపథ్యంలో జాతీయ వాయుసేన స్పందించింది. అనవసరంగా తెలిసీ తెలియని ఊహాగానాలను పెట్టుకోవద్దని కోరింది.  ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ఖాతా ద్వారా శుక్రవారం ట్వీట్ చేసింది. ‘ఈ నెల 8న జరిగిన విషాద హెలికాప్టర్ ప్రమాదంపై విచారణకు‌గానూ త్రివిధ దళాలతో కమిటీ ఏర్పాటు చేశాం. ఈ దర్యాప్తును వేగంగా పూర్తి చేసి త్వరలోనే వాస్తవ వివరాలను బయటపెడుతాం. అప్పటివరకు […]

Update: 2021-12-10 09:17 GMT

న్యూఢిల్లీ: హెలికాప్టర్ ప్రమాదంపై పుకార్లు వస్తున్న నేపథ్యంలో జాతీయ వాయుసేన స్పందించింది. అనవసరంగా తెలిసీ తెలియని ఊహాగానాలను పెట్టుకోవద్దని కోరింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ఖాతా ద్వారా శుక్రవారం ట్వీట్ చేసింది. ‘ఈ నెల 8న జరిగిన విషాద హెలికాప్టర్ ప్రమాదంపై విచారణకు‌గానూ త్రివిధ దళాలతో కమిటీ ఏర్పాటు చేశాం. ఈ దర్యాప్తును వేగంగా పూర్తి చేసి త్వరలోనే వాస్తవ వివరాలను బయటపెడుతాం.

అప్పటివరకు మృతుల పట్ల గౌరవంతో, ఊహాగానాలకు దూరంగా ఉండండి’ అని పేర్కొంది. మరోవైపు ప్రమాదానికి కారణాలుగా పేర్కొంటూ పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాగా కేంద్రం ఆదేశాలతో ఏర్పాటైన దర్యాప్తు కమిటీ గురువారమే సంఘటనా స్థలాన్ని పరిశీలించింది. ఘటనా స్థలంలో లభించిన బ్లాక్ బాక్స్ ఆధారంగా సమాచారాన్ని విశ్లేషించి, వాస్తవాలు బయట పెట్టనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News