అసాంఘిక చర్యలకు పాల్పడితే అస్సలు వదలొద్దు : DSP వెంకటేశ్వర్ బాబు

దిశ, అన్నపురెడ్డిపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల స్థానిక పోలీస్ స్టేషన్‌ను గురువారం కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వర్ బాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆ తర్వాత పోలీస్‌స్టేషన్ లోనికి వచ్చి రికార్డులను, పరిసరాలను పరిశీలించారు. శాంతి భద్రతలపై ప్రత్యేకంగా చర్చ జరిపారు. నేరాల నియంత్రణకు చేపట్టిన చర్యలను గురించి ఎస్సై తిరుపతిని అడిగి తెలుసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే ఎవరిని వదలొద్దని, కఠినమైన చర్యలు తీసుకోవాలని […]

Update: 2021-12-16 10:41 GMT
అసాంఘిక చర్యలకు పాల్పడితే అస్సలు వదలొద్దు : DSP వెంకటేశ్వర్ బాబు
  • whatsapp icon

దిశ, అన్నపురెడ్డిపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల స్థానిక పోలీస్ స్టేషన్‌ను గురువారం కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వర్ బాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆ తర్వాత పోలీస్‌స్టేషన్ లోనికి వచ్చి రికార్డులను, పరిసరాలను పరిశీలించారు. శాంతి భద్రతలపై ప్రత్యేకంగా చర్చ జరిపారు.

నేరాల నియంత్రణకు చేపట్టిన చర్యలను గురించి ఎస్సై తిరుపతిని అడిగి తెలుసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే ఎవరిని వదలొద్దని, కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలతో పోలీస్ సిబ్బంది స్నేహ పూర్వకంగా మెలగాలన్నారు. మండలంలో అవసరమైన చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

Tags:    

Similar News