ఆపరేషన్ థియేటర్ లో షార్ట్ సర్క్యూట్

పట్టణంలోని శ్రీ రక్షా హాస్పిటల్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఆపరేషన్ థియేటర్ లో మంటలు చెలరేగి సుమారు రూ. 10 లక్షల విలువైన ఆపరేషన్ సామాగ్రి పూర్తిగా కాలిపోయి నష్టం వాటిల్లిందని యాజమాన్యం తెలిపారు.

Update: 2025-01-14 12:53 GMT
ఆపరేషన్ థియేటర్ లో షార్ట్ సర్క్యూట్
  • whatsapp icon

దిశ పాల్వంచ టౌన్: పట్టణంలోని శ్రీ రక్షా హాస్పిటల్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఆపరేషన్ థియేటర్ లో మంటలు చెలరేగి సుమారు రూ. 10 లక్షల విలువైన ఆపరేషన్ సామాగ్రి పూర్తిగా కాలిపోయి నష్టం వాటిల్లిందని యాజమాన్యం తెలిపారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, సంఘటన జరిగిన వెంటనే హాస్పిటల్ సిబ్బంది వెంటనే ఫైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించడంతో వారు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు పరిశీలిస్తున్నారు.


Similar News