కేసీఆర్ ఆదేశాలతోనే బండి సంజయ్‌పై దాడి.. తీవ్ర ఆరోపణలు చేసిన డీకే అరుణ..

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఒప్పందం ప్రకారం 40 లక్షల మెట్రిక్​టన్నుల ధాన్యం కొనాల్సి ఉండగా 60 లక్షల మెట్రిక్​ధాన్యం కొంటామని చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైతో బీజేపీ బృందం మంగళవారం భేటీ అయ్యింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై దాడి, పోలీసుల వ్యవహారశైలిపై గవర్నర్‌కు నేతలు ఫిర్యాదు చేశారు. తెలంగాణ సర్కార్ వానాకాలం పంటను కొనకుండా […]

Update: 2021-11-16 08:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఒప్పందం ప్రకారం 40 లక్షల మెట్రిక్​టన్నుల ధాన్యం కొనాల్సి ఉండగా 60 లక్షల మెట్రిక్​ధాన్యం కొంటామని చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైతో బీజేపీ బృందం మంగళవారం భేటీ అయ్యింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై దాడి, పోలీసుల వ్యవహారశైలిపై గవర్నర్‌కు నేతలు ఫిర్యాదు చేశారు. తెలంగాణ సర్కార్ వానాకాలం పంటను కొనకుండా రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్న విషయాన్ని బీజేపీ నాయకులు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.

అనంతరం మీడియాతో డీకే అరుణ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతుల సమస్యలు తెలుసుకునేందుకు బండి సంజయ్ ఐకేపీ సెంటర్ల పరిశీలించడానికి వెళ్తే.. టీఆర్ఎస్ నేతలు రాళ్లు, గుడ్లతో దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజురాబాద్‌లో బీజేపీ గెలుపును జీర్ణించుకోలేక టీఆర్ఎస్ ఈ దాడులకు తెగబడిందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతోనే బండి సంజయ్‌పై దాడి జరిగిందని డీకే అరుణ ఆరోపించారు. వర్షాలతో ధాన్యం తడిసిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.

మెడలు నరుకుతా, ఆరు ముక్కలు చేస్తా అని బెంగాల్ తరహాలోనే తెలంగాణలో సైతం కేసీఆర్​అరాచక పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రజల పక్షాన పోరాడుతుందని ఆమె స్పష్టం చేశారు. హుజురాబాద్​బైపోల్‌లో అధికారికంగా రూ.4 వేల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. అబద్ధపు హామీలు ఇచ్చినా.. హుజురాబాద్ ప్రజలు లొంగలేదని కేసీఆర్​పగ పెంచుకున్నారని తెలిపారు. హుజురాబాద్ ప్రజలు తెలంగాణకు ఆదర్శంగా నిలిచారన్నారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎందుకు ప్రారంభించలేదో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. టీఆర్ఎస్ గూండాగిరీకి భయపడేది లేదని డీకే అరుణ తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి రైతులకు వెంటనే ధాన్యం డబ్బులు చెల్లించాలని ఆమె డిమాండ్​చేశారు. ఇదిలా ఉండగా నల్లగొండలో జరిగిన దాడి ఘటనపై బీజేపీ అధిష్టానం ఆరా తీస్తోంది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని పార్టీకి అధిష్టానం సూచించింది.

కేసీఆర్​ భరతం పడుతాం : ఎమ్మెల్యే ఈటల రాజేందర్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​రైతుల సమస్యలు తెలుసుకునేందుకు జిల్లాల పర్యటనలు చేసుకుంటే కేసీఆర్ దాడులు చేయిస్తున్నారని, ధాన్యం కొనుగోలు చేపట్టకుంటే కేసీఆర్​భరత పడతామని హుజురాబాద్​ఎమ్మెల్యే ఈటల రాజేందర్​హెచ్చరించారు. కేంద్రం 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ సెంటర్ల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతోందన్నారు. సివిల్ సప్లై కార్పొరేషన్‌కు డబ్బులు ఇవ్వకుండా.. ధాన్యం కొనుగోలు చేయకుండా ముఖ్యమంత్రి అడ్డుకుంటున్నారని అనుమానం వ్యక్తం చేశారు.

రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం : ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్..

​ బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. రైతుల సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచుకోవడానికే టీఆర్ఎస్ లేనిపోని రాద్ధాంతాలు సృష్టిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలా కక్ష సాధింపు చర్యలకు పూనుకోవటం సరైంది కాదని విమర్శించారు. సమస్య లేని చోట ప్రభుత్వం సమస్యను సృష్టించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. వ్యవసాయ మంత్రి సొంత జిల్లా రైతులు పక్క రాష్ట్రంలో ధాన్యం అమ్ముకోవటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News