డబ్బులతో రాజకీయం చేస్తున్నారు: డీకే అరుణ
దిశ, జడ్చర్ల : తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. అందుకోసం పురపాలక ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ పిలుపునిచ్చారు. పురపాలక ఎన్నికల్లో భాగంగా.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్చల మండలంలోని పార్టీ కార్యాలయంలో పలువురు కాంగ్రెస్ నేతలు అరుణ సమక్షంలో బీజేపీలోకి చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ డబ్బులతో రాజకీయం చేస్తున్నారని.. దుబ్బాక, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలుపును చూసి తట్టుకోలేకనే.. వందల కోట్లు […]
దిశ, జడ్చర్ల : తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. అందుకోసం పురపాలక ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ పిలుపునిచ్చారు. పురపాలక ఎన్నికల్లో భాగంగా.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్చల మండలంలోని పార్టీ కార్యాలయంలో పలువురు కాంగ్రెస్ నేతలు అరుణ సమక్షంలో బీజేపీలోకి చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ డబ్బులతో రాజకీయం చేస్తున్నారని.. దుబ్బాక, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలుపును చూసి తట్టుకోలేకనే.. వందల కోట్లు ఖర్చు చేసి ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకున్నారని ఆరోపించారు. ఓ వైపు కరోనా విజృంభిస్తుంటే.. మరో వైపు ఎన్నికలు జరపడం ప్రజల ప్రాణాలతో చెలగాటమని అభివర్ణించారు. ప్రభుత్వ వైఫల్యాలను గమనిస్తున్న ప్రజలు.. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు ఐదు మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీకే పట్టం కడుతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.