సరికొత్త రికార్డు.. ఫెదరర్ సరసన జకోవిచ్..

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ నోవాక్ జకోవిచ్ సరికొత్త రికార్డును సృష్టించాడు. మెన్స్ సింగిల్స్ టెన్నిస్‌లో ప్రపంచ నెంబర్ 1 ర్యాంకులో 310 వారాల పాటు కొనసాగిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. సెర్బియాకు చెందిన నోవాక్ జకోవిచ్ 2020 ఫిబ్రవరి నుంచి టాప్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. గత ఏడాది ఆరో సారి వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకుతో ముగించి పీట్ సాంప్రాస్ రికార్డును సమం చేశాడు. తాజాగా 310 వారాలు వరల్డ్ నెంబర్ వన్‌గా […]

Update: 2021-03-01 11:06 GMT

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ నోవాక్ జకోవిచ్ సరికొత్త రికార్డును సృష్టించాడు. మెన్స్ సింగిల్స్ టెన్నిస్‌లో ప్రపంచ నెంబర్ 1 ర్యాంకులో 310 వారాల పాటు కొనసాగిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. సెర్బియాకు చెందిన నోవాక్ జకోవిచ్ 2020 ఫిబ్రవరి నుంచి టాప్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. గత ఏడాది ఆరో సారి వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకుతో ముగించి పీట్ సాంప్రాస్ రికార్డును సమం చేశాడు. తాజాగా 310 వారాలు వరల్డ్ నెంబర్ వన్‌గా ఉన్న రోజర్ ఫెదరర్ సరసన చేరాడు. మరో వారం అదే ర్యాంకులో కొనసాగతే అత్యధిక వారాలు నెంబర్ వన్ ర్యాంకులో ఉన్న ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. ఈ 310 వారాల్లో.. 122 వారాలు వరుసగా టాప్ ర్యాంకులోనే ఉన్నాడు. 2014 జులై నుంచి 2016 నవంబర్ వరకు వరుసగా టాప్ ర్యాంకులో కొనసాగాడు. అయితే ఫెదరర్ 237 వారాలు వరుసగా టాప్ ర్యాంకులో కొనసాగటం విశేషం.

టాప్ 10 ర్యాంకులు (1 మార్చి 2021 నాటికి)

1. నొవాక్ జకోవిచ్ (12030 పాయింట్లు)
2. రఫెల్ నదాల్ (9850)
3. డానిల్ మెద్వెదేవ్ (9735)
4. డోమినిక్ థీమ్ (9125)
5. రోజర్ ఫెదరర్ (6630)
6. స్టెఫానోస్ సిట్సిపాస్ (6595)
7. అలెగ్జాండర్ జ్వెరెవ్ (5615)
8. ఆండ్రీ రూబ్లేవ్ (4609)
9. డియాగో ష్వాట్జ్‌మాన్ (3480)
10. మాటో బెరెటినీ (3480)

Tags:    

Similar News