పేకాట వారోత్సవాలు షురూ 

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : దీపావళి పండగ మరో రెండు రోజులు ఉండగానే ఇందూర్ జిల్లాలో పేకాట వారోత్సవాలు షురూ అయ్యాయి. పండుగ నాడు పేకాడే సంప్రాదాయం దశాబ్ధాలుగా ఇక్కడ ఉంది. దీంతో ఇప్పటికే జూదరులు పత్తాలాటలో ముగిని తేలుతున్నారు. సంప్రదాయం పేర బడా పారిశ్రామిక వేత్తలు, పొలిటికల్​లీడర్లు, ఉద్యోగుల నుంచి కూలి పనిచేసుకునేవారు పేకాడుతుంటారు. అందుకు ప్రత్యేకంగా కొంతమంది స్థావరాలను సైతం ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ర్టంలో పేకాట నిషేధం ఉన్నరోజుల్లోనే పండగనాడు బహిరంగంగా టెంట్లు వేసి […]

Update: 2020-11-13 00:10 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : దీపావళి పండగ మరో రెండు రోజులు ఉండగానే ఇందూర్ జిల్లాలో పేకాట వారోత్సవాలు షురూ అయ్యాయి. పండుగ నాడు పేకాడే సంప్రాదాయం దశాబ్ధాలుగా ఇక్కడ ఉంది. దీంతో ఇప్పటికే జూదరులు పత్తాలాటలో ముగిని తేలుతున్నారు. సంప్రదాయం పేర బడా పారిశ్రామిక వేత్తలు, పొలిటికల్​లీడర్లు, ఉద్యోగుల నుంచి కూలి పనిచేసుకునేవారు పేకాడుతుంటారు. అందుకు ప్రత్యేకంగా కొంతమంది స్థావరాలను సైతం ఏర్పాటు చేశారు.

ఉమ్మడి రాష్ర్టంలో పేకాట నిషేధం ఉన్నరోజుల్లోనే పండగనాడు బహిరంగంగా టెంట్లు వేసి మూడు ముక్కలాట, అందర్, బాహర్, రమ్మీ ఆడిన చరిత్ర జిల్లాకు ఉంది. పండుగ నాడు పత్తాలాడుతూ పోలీసులకు దొరికిన వారి సంఖ్య వేలు దాటడం, ఒకో స్టేషన్​పరిధిలో రూ. లక్షల్లో నగదు పట్టుబడుతుందంటే ఏ స్థాయిలో శిబిరాలు నిర్వహిస్తున్నారో అర్థం అవుతోంది. జూదంలో రూ. లక్షలు పోగొట్టుకుని ప్రాణాలు తీసుకున్న వారు, ఆప్పుల పాలైన ఘటనలు ఎన్నో ఉన్నా పేకాట రాయుళ్లలో మాత్రం మార్పు రావడం లేదు.

జిల్లా కేంద్రంతోపాటు మండలాల్లో..

తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల్లో మొదటిది పేకాట నిషేధం. క్లబ్ ల నుంచి రిసార్టుల వరకు రిక్రియేషన్ ముసుగులో జరిగే జూదాన్ని ప్రభుత్వం నిషేధించింది. అంత వరకు బాగానే ఉన్న పేకాట అంటే పడిచచ్చే పందెం రాయుళ్లకు, జూదం రుచి మరిగిన వారి అటను నియంత్రించడంలో పోలీసు శాఖ విఫలం అయిందనే చెప్పవచ్చు. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఆర్మూర్, బోధన్​లాంటి పట్టణాలతో పాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడతో పాటు చాలా మండలాల్లో జోరుగా పేకాడుతున్నారనే ఆరోపణలున్నాయి.

అపార్ట్​మెంట్లు.. త్రీ స్టార్​ హోటళ్లు..

జిల్లాలో పేకాట నిషేధమని పోలీసులు ప్రకటనలు చేస్తున్నా నిర్వాహకులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. కొందరు నిర్వాహకులు స్థానిక ఎస్ హెచ్ వోలను మేనేజ్​ చేసుకుని నిరాటకంగా కొనసాగిస్తున్నారనే విషయం ఇటీవల టాస్క్ ఫోర్స్, స్పెషల్ పార్టీ ( ఐడీ) దాడుల్లో తేట తెల్లమైంది. నందిపేట్ మండలం పేకాటకు మంచి స్థావరమని ప్రతీతి. ఇక్కడి జూదరులకు మద్యం, అంకాపూర్ చికెన్​సరఫరా చేస్తారని సమాచారం. అలాగే జిల్లాలోని కొన్ని ఆపార్ట్ మెంట్లు, త్రీ స్టార్​హోటళ్లలో శిబిరాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పండుగ వేళ బహిరంగంగానే ఆడుతున్నా ఎవరూ పట్టించుకోరని, ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు బాధిత కుటుంబసభ్యులు కోరుతున్నారు.

రూ. 2.77 లక్షల నగదు పట్టివేత

దిశ, జక్కల్​ : బిచ్కుందలోని ఓ ఇంట్లో నిర్వహిస్తున్న పే కాట శిబిరంపై బుధవారం రాత్రి పోలీసులు దాడులు చేశా రు. ఈ సందర్భంగా 18 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసి, వారి నుంచి రూ. 2,77,253 నగదు, 18 సెల్​ఫో న్లు, 8 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కా గా, దీపావళి పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పేకా ట స్థావరాలు వెలుస్తున్నాయని, ఉన్నతాధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

Tags:    

Similar News