దీపావళి వేడుకలకు రండి.. గవర్నర్ దత్తాత్రేయకు ఆహ్వానం

దిశ, చార్మినార్: చారిత్రాత్మక చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం దీపావళి పండుగ పర్వదిన వేడుకలకు ముస్తాబవుతోంది. ఈనెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ శశికళ తెలిపారు. ఈ నెల 2వ తేదీన ‘ధన్ తెరాస్’ పూజా కార్యక్రమం, ఈ నెల 3వ తేదీన నరకచతుర్దశి ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో భక్తులు భారీగా పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని సూచించారు. అమ్మవారికి అభిషేకించిన […]

Update: 2021-10-31 04:39 GMT

దిశ, చార్మినార్: చారిత్రాత్మక చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం దీపావళి పండుగ పర్వదిన వేడుకలకు ముస్తాబవుతోంది. ఈనెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ శశికళ తెలిపారు. ఈ నెల 2వ తేదీన ‘ధన్ తెరాస్’ పూజా కార్యక్రమం, ఈ నెల 3వ తేదీన నరకచతుర్దశి ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో భక్తులు భారీగా పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని సూచించారు. అమ్మవారికి అభిషేకించిన ఖజానాను 6వ తేదీ వరకు భక్తులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. దీపావళి ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆమె పిలుపునిచ్చారు.

గవర్నర్​ దత్తాత్రేయకు ఆహ్వానం

చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయంలో జరిగే దీపావళి వేడుకలకు హాజరుకావాలని హర్యానా రాష్ట్ర గవర్నర్​బండారు దత్తాత్రేయకు ఆలయ ట్రస్టీ చైర్మన్ శశికళ ఆహ్వానం అందజేసింది.

Tags:    

Similar News