సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: సింగరేణి సంస్థలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ఈ నెల 12న దీపావళి (పీఎల్​ఆర్​) బోనస్​ను చెల్లించేందుకు నిర్ణయించినట్టు శనివారం సంస్థ ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవల జరిగిన జేబీసీసీఐ 10వ సమావేశంలో ఒప్పందం చేసుకున్న విధంగా ఒక్కో కార్మికుడికి రూ.68,500 చెల్లించనున్నట్టు అందులో పేర్కొంది. ఇందుకు గాను 2019–20 ఆర్థిక సంవత్సరంలో అండర్​ గ్రౌండ్​లో విధులు నిర్వహించిన వారు 190 మస్టర్లు, సర్ఫేస్​లో పనిచేసే వారు 240 మస్టర్లు ఖచ్చితంగా పూర్తిచేసిన వారు […]

Update: 2020-11-07 06:25 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: సింగరేణి సంస్థలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ఈ నెల 12న దీపావళి (పీఎల్​ఆర్​) బోనస్​ను చెల్లించేందుకు నిర్ణయించినట్టు శనివారం సంస్థ ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవల జరిగిన జేబీసీసీఐ 10వ సమావేశంలో ఒప్పందం చేసుకున్న విధంగా ఒక్కో కార్మికుడికి రూ.68,500 చెల్లించనున్నట్టు అందులో పేర్కొంది. ఇందుకు గాను 2019–20 ఆర్థిక సంవత్సరంలో అండర్​ గ్రౌండ్​లో విధులు నిర్వహించిన వారు 190 మస్టర్లు, సర్ఫేస్​లో పనిచేసే వారు 240 మస్టర్లు ఖచ్చితంగా పూర్తిచేసిన వారు ఈ బోనస్ పొందేందుకు అర్హులు అని యాజమాన్యం పేర్కొంది. ఈ పీఆర్​ఎస్ బోనస్ నాన్ ఎగ్జిక్యూటివ్​, పదో వేజ్​బోర్డు కిందకు వచ్చిన వారికి వర్తిస్తుందని స్పష్టం చేసింది.

Tags:    

Similar News