ఆ సెంటర్ల ఏర్పాటుకు… దరఖాస్తుల ఆహ్వానం

దిశ ప్రతినిధి, హైదరాబాద్: జిల్లా స్థాయి ఖేళో ఇండియా సెంటర్ల ఏర్పాటుకు సీనియర్ క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆదేశాల మేరకు హైదరాబాద్ జిల్లాలో 3 ఖేళో ఇండియా సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు జిల్లా యువజన సంఘం చైర్ పర్సన్, జిల్లా కలెక్టర్ శ్వేతా మెహంతి తెలిపారు. అర్చరీ, […]

Update: 2020-08-31 05:26 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: జిల్లా స్థాయి ఖేళో ఇండియా సెంటర్ల ఏర్పాటుకు సీనియర్ క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆదేశాల మేరకు హైదరాబాద్ జిల్లాలో 3 ఖేళో ఇండియా సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు జిల్లా యువజన సంఘం చైర్ పర్సన్, జిల్లా కలెక్టర్ శ్వేతా మెహంతి తెలిపారు.

అర్చరీ, బాక్సింగ్, బ్యాడ్మింటన్, సైక్లింగ్, హాకీ, జూడో, రోయింగ్, షూటింగ్, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, ఫుట్ బాల్ వంటి క్రీడల నుంచి మూడు అంశాలకు సంబంధించి ఖేళో ఇండియా సెంటర్లు మాత్రమే గుర్తించబడుతాయన్నారు. సుమారు 5 సంవత్సరాల అనుభవం కలిగిన జిల్లాకు చెందిన క్రీడాకారులు సెప్టెంబర్ 9వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో సూచించారు. దరఖాస్తులు, ఇతర అన్ని వివరాలు www.kheloindia.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఆమె సూచించారు.

Tags:    

Similar News