‘విద్యుత్తు బిల్లులపై అపోహలు వద్దు’
దిశ, మెదక్: విద్యుత్తు బిల్లులపై అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దని సిద్దిపేట జిల్లా విద్యుత్తు శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ కరుణాకర్ బాబు అన్నారు. ఏ తప్పులున్నా సరిచేసుకునే అవకాశం ఇస్తున్నామని, అనుమానాల నివృత్తికి ప్రతి ఈఆర్‌వో (ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కార్యాలయం)లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వినియోగం పెరిగే కొద్దీ కేటగిరి మారిందన్నారు. సాధారణ రోజుల కన్నా వేసవి వినియోగం 30 నుంచి 40శాతం దాకా ఎక్కువ ఉంటుందని, లాక్‌డౌన్‌తో 15 నుంచి 20శాతం అదనపు వినియోగం […]
దిశ, మెదక్: విద్యుత్తు బిల్లులపై అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దని సిద్దిపేట జిల్లా విద్యుత్తు శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ కరుణాకర్ బాబు అన్నారు. ఏ తప్పులున్నా సరిచేసుకునే అవకాశం ఇస్తున్నామని, అనుమానాల నివృత్తికి ప్రతి ఈఆర్‌వో (ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కార్యాలయం)లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వినియోగం పెరిగే కొద్దీ కేటగిరి మారిందన్నారు. సాధారణ రోజుల కన్నా వేసవి వినియోగం 30 నుంచి 40శాతం దాకా ఎక్కువ ఉంటుందని, లాక్‌డౌన్‌తో 15 నుంచి 20శాతం అదనపు వినియోగం నమోదైందని తెలిపారు. రెగ్యులర్ బిల్లులతో పాటు అందరూ బకాయిలు కట్టాలన్నారు. సరాసరి బిల్లుల వల్ల కొందరికి ప్రయోజనం, మరికొందరికి నష్టం జరిగే అవకాశాలున్నాయని చెప్పారు. మూడు నెలల రీడింగును తీసి, మూడు భాగాలుగా భాగించామని, ఒక్క యూనిట్ కుడా ఎక్కువ వేయలేదని స్పష్టం చేసారు.