మావోల స్థావరం.. వస్తువులు స్వాధీనం
దిశ, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం మల్లెతోగు అటవీ ప్రాంతంలో బుధవారం మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో మావోయిస్టుల స్థావరం నుంచి స్వాధీనం చేసుకున్న సామగ్రి వివరాలను గురువారం ఎస్పీ సునీల్‌దత్ ఒక ప్రకటనలో వెల్లడించారు. సంఘటనా స్థలంలో ఒక 8ఎంఎం రైఫిల్, 08 రౌండ్లు, 07 డిటోనేటర్స్,01 ఐఈడీ, 10 కిట్ బ్యాగులు, 01 మెడిసిన్ బ్యాగు, 01 వంట సామగ్రి బ్యాగు, 01 సోలార్ […]
దిశ, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం మల్లెతోగు అటవీ ప్రాంతంలో బుధవారం మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో మావోయిస్టుల స్థావరం నుంచి స్వాధీనం చేసుకున్న సామగ్రి వివరాలను గురువారం ఎస్పీ సునీల్‌దత్ ఒక ప్రకటనలో వెల్లడించారు. సంఘటనా స్థలంలో ఒక 8ఎంఎం రైఫిల్, 08 రౌండ్లు, 07 డిటోనేటర్స్,01 ఐఈడీ, 10 కిట్ బ్యాగులు, 01 మెడిసిన్ బ్యాగు, 01 వంట సామగ్రి బ్యాగు, 01 సోలార్ ప్యానెల్స్ బ్యాగు, ఎలక్ట్రానిక్ సామగ్రి, విప్లవ సాహిత్యం, 02 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.