వలస కార్మికులకు మంత్రి బియ్యం పంపిణీ

దిశ, మేడ్చల్: మేడ్చల్​ మున్సిపాలిటీలో 500 మంది నిరుపేదలకు మంత్రి మల్లారెడ్డి బియ్యం పంపిణీ చేశారు. ఇలాంటి విపత్కర సమయంలో దాతలు ముందుకు రావాలని కోరారు. దాతల సహకారంతోనే పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గంలోని అన్ని పరిశ్రమలు లాక్​డౌన్​ను పాటిస్తున్న కారణంగా.. అక్కడ పనిచేసే కార్మికులకు అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బియ్యం పంపిణీకి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరినీ మంత్రి అభినందించారు. కార్యక్రమంలో […]

Update: 2020-04-02 09:17 GMT

దిశ, మేడ్చల్: మేడ్చల్​ మున్సిపాలిటీలో 500 మంది నిరుపేదలకు మంత్రి మల్లారెడ్డి బియ్యం పంపిణీ చేశారు. ఇలాంటి విపత్కర సమయంలో దాతలు ముందుకు రావాలని కోరారు. దాతల సహకారంతోనే పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గంలోని అన్ని పరిశ్రమలు లాక్​డౌన్​ను పాటిస్తున్న కారణంగా.. అక్కడ పనిచేసే కార్మికులకు అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బియ్యం పంపిణీకి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరినీ మంత్రి అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ దీపికా నర్సింహారెడ్డి, వైస్ ఛైర్మన్ రమేశ్​, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ, పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

tag: minister mallareddy, Distribution, rice, migrant workers, medchal

Tags:    

Similar News