పారిశుద్ద్య కార్మికులకు హైజీన్ కిట్లు.. పంపిణీ చేసిన హర్యానా గవర్నర్
దిశ, చార్మినార్: చారిత్రాత్మక చార్మినార్ వద్ద యంగిస్తాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యుఎన్‌ఐసిఇఎఫ్, సహకారంతో సోమవారం పారిశుద్ద్య కార్మికులకు హైజీన్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చెత్త సేకరణ సమయంలో కోవిడ్19 బారిన పడే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో చార్మినార్, ఎల్బీనగర్ జోన్‌లో పనిచేస్తున్న పారిశుద్ద్య కార్మికులకు 1500 హైజీన్ కిట్‌లను ప్రత్యేకంగా రూపొందించారు. దాదాపు 60 మంది పారిశుద్ద్య కార్మికులకు గవర్నర్ దత్తాత్రేయ […]
దిశ, చార్మినార్: చారిత్రాత్మక చార్మినార్ వద్ద యంగిస్తాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యుఎన్‌ఐసిఇఎఫ్, సహకారంతో సోమవారం పారిశుద్ద్య కార్మికులకు హైజీన్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చెత్త సేకరణ సమయంలో కోవిడ్19 బారిన పడే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో చార్మినార్, ఎల్బీనగర్ జోన్‌లో పనిచేస్తున్న పారిశుద్ద్య కార్మికులకు 1500 హైజీన్ కిట్‌లను ప్రత్యేకంగా రూపొందించారు.
దాదాపు 60 మంది పారిశుద్ద్య కార్మికులకు గవర్నర్ దత్తాత్రేయ చేతుల మీదుగా హైజీన్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసి ఆరోగ్య విభాగం అడిషనల్ కమిషనర్ బదావత్ సంతోష్, యంగిస్తాన్ ఫౌండేషన్ డైరెక్టర్ అరుణ్ డానియేల్ తదితరులు పాల్గొన్నారు.