ఎల్లుండి నుంచి ఉచిత చేప పిల్లల పంపిణీ

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 6 నుంచి నాలుగో విడత ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెం గ్రామంలోని పెంటాని చెరువులో చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్నిలాంఛనంగా ప్రారంభిస్తున్నామన్నారు. చేప పిల్లల పంపిణీపై మంత్రి తలసాని అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 6న మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం మడిగట్ల గ్రామంలోని మడికాని చెరువు, కోడూర్‌ […]

Update: 2020-08-04 08:58 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 6 నుంచి నాలుగో విడత ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెం గ్రామంలోని పెంటాని చెరువులో చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్నిలాంఛనంగా ప్రారంభిస్తున్నామన్నారు. చేప పిల్లల పంపిణీపై మంత్రి తలసాని అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 6న మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం మడిగట్ల గ్రామంలోని మడికాని చెరువు, కోడూర్‌ గ్రామంలోని మైసమ్మ చెరువులో జిల్లాకు చెందిన ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి చేప పిల్లలను విడుదల చేస్తామన్నారు. అనంతరం రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండలం కమ్మదనం గ్రామంలోని వెంకటాయకుంటలో మంత్రి సబితారెడ్డి, స్ధానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌తో కలిసి చేపపిల్లలను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. నాల్గొ విడుతలో రాష్ట్రంలోని రిజర్వాయర్‌లు, చెరువులలో రూ. 50కోట్ల ఖర్చుతో 81కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. అదే విధంగా రూ. 10 కోట్లతో 5కోట్ల రొయ్య పిల్లలను కూడా చెరువుల్లోకి విడుదల చేయనున్నారు.

Tags:    

Similar News