జర్నలిస్టులకు నిత్యావసర వస్తువుల పంపిణీ
దిశ, రంగారెడ్డి: జర్నలిస్టులకు గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొద్దు లచ్చిరెడ్డి చేయూతనిచ్చారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బీయన్‌రెడ్డి నగర్, వనస్థలిపురం పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. రూ. లక్ష విలువ చేసే బియ్యం, పప్పులు, నిత్యావసర వస్తువులు జర్నలిస్టులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న సమయంలో అందరూ ఇళ్లల్లో ఉంటే జర్నలిస్టులు మాత్రం ప్రమాదం అంచున పనిచేస్తున్నారన్నారు. అలాంటి వారికి అండగా నిలవడం ప్రతి పౌరుడి బాధ్యత […]
దిశ, రంగారెడ్డి: జర్నలిస్టులకు గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొద్దు లచ్చిరెడ్డి చేయూతనిచ్చారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బీయన్‌రెడ్డి నగర్, వనస్థలిపురం పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. రూ. లక్ష విలువ చేసే బియ్యం, పప్పులు, నిత్యావసర వస్తువులు జర్నలిస్టులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న సమయంలో అందరూ ఇళ్లల్లో ఉంటే జర్నలిస్టులు మాత్రం ప్రమాదం అంచున పనిచేస్తున్నారన్నారు. అలాంటి వారికి అండగా నిలవడం ప్రతి పౌరుడి బాధ్యత అని చెప్పారు. ప్రభుత్వాలకు ప్రజలకు అన్ని సమయాల్లో వారధిగా నిలుస్తున్న జర్నలిస్టులకు తన వంతుగా సహకరించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా మాజీ ఉపాధ్యక్షులు దశరథ అశోక్, టీఆర్ఎస్ యూత్ నాయకులు, టీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యులు బద్దుల మల్లేష్ యాదవ్, నరేందర్, మధు తదితరులు పాల్గొన్నారు.
Tags: Distribution, essential commodities, journalists, rangareddy