‘పేదలను ఆదుకునేందుకు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కృషి’
దిశ, మహబూబ్‌నగర్: లాక్‌డౌన్ వల్ల దేశవ్యాప్తంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని ఆ పార్టీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కన్వీనర్ సంపత్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్మికులకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలకు సాయం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిందని తెలిపారు. అలాగే, టీఆర్ఎస్ నాయకులు వారి […]
దిశ, మహబూబ్‌నగర్: లాక్‌డౌన్ వల్ల దేశవ్యాప్తంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని ఆ పార్టీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కన్వీనర్ సంపత్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్మికులకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలకు సాయం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిందని తెలిపారు. అలాగే, టీఆర్ఎస్ నాయకులు వారి జేబులోంచి ఏమీ ఇవ్వట్లేదనీ, ప్రభుత్వం నుంచి వచ్చిన సాయాన్నే గులాబీ కండువాలు వేసుకుని పంచుతున్నారని విమర్శించారు. పీపీఈ కిట్ల కొనుగోలులోనూ రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.
Tags : Distribution, essential commodities, poor, Congress Party, Task Force