రెండు కోట్ల విలువైన.. మొబైల్ ఫోన్లు రికవరీ చేసిన రాచకొండ పోలీసులు!
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో సుమారు రెండు కోట్ల విలువైన 591 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు.
దిశ, మల్కాజిగిరి: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో సుమారు రెండు కోట్ల విలువైన 591 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో సెల్ ఫోన్లు దొంగతనాలు పెరగిపోయిన నేపథ్యంలో సీపీ సూచన మేరకు ఐటీ సెల్ సమన్వయంతో సీసీఎస్ ఎల్బీనగర్, మల్కాజిగిరి, భువనగిరిలలో ప్రత్యేక బృందాలుగా సిఈఐఆర్ పోర్టల్ లో ఫోన్ల ఐఎంఈఐల ట్రాకింగ్ ద్వారా 25 రోజుల వ్యవధిలోనే రెండు కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు సీపీ తెలిపారు. గురువారం నేరేడ్మేట్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 3213 మొబైల్ ఫోన్లును రికవరీ చేసినట్లు తెలిపారు.హైదరాబాద్ తర్వాత రాచకొండ రెండోస్థానంలో నిలించిందని తెలిపారు. పోగోట్టుకున్న వారి మొబైల్స్ లను యజమానులకు అందజేశారు. ఎవరైనా తమ మొబైల్ ఫోన్లు దొంగతనానికి గురైనప్పుడు వెంటనే మొబైల్ ఐఎంఈఐ నంబర్ ఆధారంగా సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే, ఆ నంబర్ ఆధారంగా సీఈఐఆర్ పోర్టల్ ద్వారా చోరీకి గురైన మొబైల్ ఫోన్స్ రికవరీ చేస్తామని సీపీ తెలిపారు. ఎబ్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 339, మల్కాజిగిరి పరిధిలోని 149, భువనగిరిలోని 103 సెల్ ఫోన్లు, మొత్తం 591 ఫోన్ లను రికవరీ చేశామన్నారు. క్రైం డీసీపీ అరవింద్ బాబు, క్రైం ఎడిసిపీ శ్రీనివాసులు, సీసీఎస్, ఐటీసెల్ అధికారులను సీపీ అభినందించారు.