‘సలేశ్వరం లింగమయ్య జాతర రద్దు’

దిశ, మహబూబ్‌నగర్: ప్రతిఏడాదీ మూడ్రోజుల పాటు సాగే సలేశ్వరం లింగమయ్య జాతరకు కరోనావైరస్ బ్రేక్ వేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు వచ్చి దర్శింకుంటారు. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం సలేశ్వరం లింగమయ్య జాతరను కరోనా ప్రభావంతో రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.  ఏప్రిల్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. నాలుగు రోజుల పాటు సాగనున్న సలేశ్వరం జాతర ఏటా చైత్ర శుద్ధ పౌర్ణమి సమయంలో […]

Update: 2020-03-20 09:10 GMT

దిశ, మహబూబ్‌నగర్: ప్రతిఏడాదీ మూడ్రోజుల పాటు సాగే సలేశ్వరం లింగమయ్య జాతరకు కరోనావైరస్ బ్రేక్ వేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు వచ్చి దర్శింకుంటారు. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం సలేశ్వరం లింగమయ్య జాతరను కరోనా ప్రభావంతో రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. నాలుగు రోజుల పాటు సాగనున్న సలేశ్వరం జాతర ఏటా చైత్ర శుద్ధ పౌర్ణమి సమయంలో ప్రారంభమవుతుంది. కాలినడకనే బయలుదేరి ప్రకృతి ఒడిలో వెలసిన లింగమయ్యకు భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. అమరనాథ్ యాత్రను తలపించేలా ఉండే సలేశ్వర జాతరకు తెలంగాణ, ఆంధ్ర‌ప్రదేశ్, చత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. కరోనా కోవిడ్-19 నేపథ్యంలో సలేశ్వరం జాతరను రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ శ్రీధర్ శుక్రవారం ప్రకటించారు.

Tags : Dissolution, Salemesvaram Lingamiah Jatara, mahaboobnagar, district collector

 

Tags:    

Similar News