షాకింగ్: 59 మంది వార్డు సభ్యులపై అనర్హత వేటు.. నోటీసులు ఇచ్చిన ఎన్నికల కమిషన్
దిశ, తాండూరు: పెద్దేముల్ మండలంలో 2019 పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యులుగా గెలుపొందిన 59 మంది వార్డు సభ్యులపై రాష్ట్ర ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసినట్లు ఎంపీఓ షేక్ సుష్మా తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీఓ మాట్లాడుతూ… గత ఎన్నికల సమయంలో ఎన్నికల ఖర్చులకు సంబంధించి వివరాలను ఎన్నికల కమిషన్ కు చూపకపోవడంతో మండలానికి చెందిన 59 మంది వార్డు సభ్యులపైన, ఇద్దరు ఉప సర్పంచ్‌లపైన అనర్హత వేటు పడినట్లు ఎంపీఓ వెల్లడించారు. అనర్హతకు గురైన […]
దిశ, తాండూరు: పెద్దేముల్ మండలంలో 2019 పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యులుగా గెలుపొందిన 59 మంది వార్డు సభ్యులపై రాష్ట్ర ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసినట్లు ఎంపీఓ షేక్ సుష్మా తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీఓ మాట్లాడుతూ… గత ఎన్నికల సమయంలో ఎన్నికల ఖర్చులకు సంబంధించి వివరాలను ఎన్నికల కమిషన్ కు చూపకపోవడంతో మండలానికి చెందిన 59 మంది వార్డు సభ్యులపైన, ఇద్దరు ఉప సర్పంచ్‌లపైన అనర్హత వేటు పడినట్లు ఎంపీఓ వెల్లడించారు.
అనర్హతకు గురైన వార్డు సభ్యుల వివరాలు
ఆడికిచర్ల 1, ఆత్కూర్ 4, బాయిమీది తండా 1, బండమీదిపల్లి 4, బండపల్లి 4, చైతన్యనగర్ 2, ఎర్రగడ్డ తండా 2, గిర్మాపూర్ 2, గోపాల్పుర్ 2, గొట్లపల్లి 1, హన్మాపూర్ 2, ఇందూరు 5, జయరాం తండా(ఐ) 5, కందనెల్లి తండా 2, మాదనంతపూర్ 3, మాన్సన్ పల్లి 4, మారేపల్లి 1, ఊరేంటి తండా 2, పాశపూర్ 3, రేగొండి 1, రుక్మాపూర్ 2, సిద్దన్నమడుగు తండా 1 చొప్పున వార్డు సభ్యులపై వేటు పడింది. ఇదిలావుంటే బండపల్లి గ్రామంలో మొత్తం ఆరుగురు వార్డు సభ్యులు ఉండగా అందులో నలుగురుపై వేటు పడటంతో ఒక వార్డు సభ్యుడు, సర్పంచ్, ఉప సర్పంచ్ మాత్రమే ఉన్నారు. అనర్హత వేటు పడిన వార్డు సభ్యులు రానున్న మూడు సంవత్సరాల వరకు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయలేరని మండల పంచాయతీ అధికారి సుష్మా తెలిపారు. వార్డు సభ్యులపై వేటు పడిన విషయాన్ని పంచాయతీ కార్యదర్శిల ద్వారా వార్డు సభ్యులకు నోటీసులు అందజేసినట్లు తెలిపారు.