సతీశ్ మెరుపు ఇన్నింగ్స్.. ‘దిశ’ అద్భుత విజయం

దిశ, స్పోర్ట్స్ : 7హెచ్ మీడియా ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్) రెండవ సీజన్‌లో భాగంగా బుధవారం ఎంఎల్ఆర్ క్రీడా మైదానంలో తెలంగాణ టుడేతో జరిగిన మ్యాచ్‌లో ‘దిశ’ జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తెలంగాణ టుడే నిర్దేశించిన 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ‘దిశ’ జట్టుకు సరైన ప్రారంభం లభించలేదు. ఓపెనర్ స్వామి (2) తొలి ఓవర్‌లోనే అవుటయ్యాడు. శివకృష్ణ వేసిన బంతికి స్వామి క్లీన్ బౌల్డ్ అయి పెవీలియన్ చేరాడు. ఆ […]

Update: 2021-02-24 06:36 GMT

దిశ, స్పోర్ట్స్ : 7హెచ్ మీడియా ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్) రెండవ సీజన్‌లో భాగంగా బుధవారం ఎంఎల్ఆర్ క్రీడా మైదానంలో తెలంగాణ టుడేతో జరిగిన మ్యాచ్‌లో ‘దిశ’ జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తెలంగాణ టుడే నిర్దేశించిన 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ‘దిశ’ జట్టుకు సరైన ప్రారంభం లభించలేదు. ఓపెనర్ స్వామి (2) తొలి ఓవర్‌లోనే అవుటయ్యాడు. శివకృష్ణ వేసిన బంతికి స్వామి క్లీన్ బౌల్డ్ అయి పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన మహేశ్ అండగా నిలవడంతో ఓపెనర్ సతీశ్ విజృంభించాడు. కేవలం 31 బంతుల్లో 46 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, ఒక సిక్స్ ఉండటం గమనార్హం. అయితే 5వ ఓవర్‌లో మహేశ్ (6) శివకృష్ణ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మధు (22) ధాటిగా ఆడి 78 పరుగుల వద్ద జకీర్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరి కొద్ది సేపటికే ఓపెనర్ సతీశ్ (46) ఇందర్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో దిశ జట్టు కాస్త కష్టాల్లో పడింది. అయితే వెంకటేష్ (23), మహేష్.కే (13) కలసి పరుగులు రాబట్టారు. వారిద్దరూ అవుటైనా.. చివర్లో శ్రీకాంత్ (5) జట్టును విజయతీరం వైపు నడిపించాడు. దిశ జట్టు కేవలం 16.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. బ్యాట్, బాల్‌తో రాణించిన సతీష్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

అంతకు ముందు టాస్ గెలిచిన తెలంగాణ టుడే జట్టు బ్యాటింగ్ ఎంచుకున్నది. ఓపెనర్లు రఘురామ్ (23), శివకృష్ణ (21) శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించారు. దిశ బౌలర్ వెంకటేష్ వేసిన 4.1వ బంతికి శివకృష్ణ (21) ఎల్బీడబ్ల్యూగా పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన శ్రీకర్ కూడా ధాటిగా ఆడాడు. ఓపెనర్ రఘురామ్‌తో కలసి రెండో వికెట్‌కు 53 పరుగులు జోడించాడు. కాగా, రాజ్‌కుమార్ వేసిన 9.5వ బంతికి శ్రీకాంత్‌కు క్యాచ్ ఇచ్చి రఘురామ్ (23) అవుటయ్యాడు. మరి కొద్ది సేపటికే రాజ్ కుమార్ బౌలింగ్‌లోనే మహేష్‌కు క్యాచ్ ఇచ్చి శ్రీకర్ (27) కూడా అవుటవడంతో తెలంగాణ టుడే పతనం ప్రారంభమైంది. జకీర్ (14) చివరి వరకు ఒంటరి పోరాటం చేసినా దిశ బౌలర్ సతీష్ అద్భుతమైన బంతులకు తెలంగాణ టుడే బ్యాట్స్‌మెన్ పెవీలియన్‌కు క్యూ కట్టారు. 13వ ఓవర్‌లో సతీష్ వరుసగా వెంకట్ (1), సాయి (0), చైతన్య (0) లను అవుట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. జకీర్ (14)ను మహేష్ అవుట్ చేయడంతో తెలంగాణ టుడే జట్టు 18.2 ఓవర్లలో కేవలం 126 పరుగులకే ఆలౌట్ అయ్యింది. సతీష్ 5, రాజ్ కుమార్ 3 వికెట్లు తీయగా, మహేష్, వెంకటేష్ చెరో వికెట్ తీశారు.

స్కోర్ బోర్డు :

తెలంగాణ టుడే
రఘురామ్ (సి) శ్రీకాంత్ (బి) రాజ్‌కుమార్ 23, శివకృష్ణ (ఎల్బీడబ్ల్యూ)(బి) వెంకటేష్ 21, శ్రీకర్ (సి) మహేష్ (బి) రాజ్‌కుమార్ 27, జకీర్ (బి) మహేష్ కే 14, వెంకట్ (బి) సతీష్ 1, సాయి (బి) సతీష్ 0, చైతన్య (ఎల్బీడబ్ల్యూ)(బి) సతీష్ 0, ఇందర్ (బి) రాజ్‌కుమార్ 2, అక్షయ్ (బి) సతీష్ 3, రవి (ఎల్బీడబ్ల్యూ) (బి) సతీష్ 0, శ్రీనివాసు 2 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 33; మొత్తం (18.2 ఓవర్లు) 126 ఆలౌట్

వికెట్ల పతనం : 1-41, 2-94, 3-104, 4-107, 5-107, 6-107, 7-111, 8-116, 9-123, 10-126

బౌలింగ్ : మహేష్.కే (3.2-0-26-1), వెంకటేష్ (2-0-36-1), మధు (2-0-11-0), స్వామి (3-0-14-0), రాజ్‌కుమార్ (4-0-22-3), సతీష్ (4-0-8-5)

దిశ
సతీష్ (సి అండ్ బి) ఇందర్ 46, స్వామి (బి) శివకృష్ణ 2, మహేష్ (బి) శివకృష్ణ 6, మధు (సి అండ్ బి) జకీర్ 22, వెంకటేష్ (ఎల్బీడబ్ల్యూ) (బి) శ్రీనివాసు 23, మహేష్.కే (సి) రఘురామ్ (బి) అక్షయ్ 13, రాజ్‌కుమార్ (రనౌట్) 1, శ్రీకాంత్ 5 నాటౌట్, బాలు 0 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (16.3 ఓవర్లు) 128/7

వికెట్ల పతనం : 3-1, 2-43, 3-78, 4-83, 5-121, 6-122, 7-124
బౌలింగ్ : శివకృష్ణ (4-0-27-2), సాయి (3-0-36-0), జకీర్ (3-0-26-1), శ్రీనివాసు (3-0-15-1), ఇందర్ (2-0-10-1), అక్షయ్ (1.3-0-12-1)

Tags:    

Similar News