'దిశ‘ సినిమా పేరు మార్పు.. రిలీజ్‌కు బ్రేక్

దిశ, తెలంగాణ బ్యూరో: ‘దిశ‘ తెలుగు సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్ వేసింది. రెండు వారాల పాటు రిలీజ్ కాకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ‘దిశ‘ తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం విచారించిన హైకోర్టు పై ఉత్తర్వులు జారీ చేసింది. చిత్రం విడుదల కాకుండా ఆపాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. వెటర్నరీ డాక్టర్ అయిన తన కుమార్తె సంఘటనను ఆధారంగా తీసుకుని దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘దిశ‘ చిత్రాన్ని నిర్మించారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. […]

Update: 2021-06-14 11:31 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ‘దిశ‘ తెలుగు సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్ వేసింది. రెండు వారాల పాటు రిలీజ్ కాకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ‘దిశ‘ తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం విచారించిన హైకోర్టు పై ఉత్తర్వులు జారీ చేసింది. చిత్రం విడుదల కాకుండా ఆపాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. వెటర్నరీ డాక్టర్ అయిన తన కుమార్తె సంఘటనను ఆధారంగా తీసుకుని దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘దిశ‘ చిత్రాన్ని నిర్మించారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. దీనిపై చిత్ర యూనిట్ తరఫున హాజరైన న్యాయవాది వాదిస్తూ, ఈ చిత్రానికి ‘దిశ‘ టైటిల్‌ను ‘ఆశ ఎన్‌కౌంటర్‘గా మార్చామని, సెన్సార్ బోర్డు సైతం ఏప్రిల్ 16నే ఏ-సర్టిఫికెట్ ఇచ్చిందని వివరించారు.

సినిమాకు దర్శక, నిర్మాతలు తామేనని, రాంగోపాల్ వర్మకు ఎలాంటి సంబంధం లేదని ఆనంద్ చంద్ర, అనురాగ్ అనే ఇద్దరు హైకోర్టుకు వివరించారు. సర్టిఫికెట్‌ను సవాలు చేయడానికి వీలుగా దిశ తండ్రి కోరిక మేరకు వారం రోజుల పాటు సినిమా విడుదల కాకుండా ఆపుతామంటూ కోర్టుకు తెలిపారు. ఇరు వర్గాల తరఫున వాదనలను విన్న హైకోర్టు బెంచ్ రెండు వారాల పాటు చిత్రాన్ని రిలీజ్ చేయకుండా ఆపాలని ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ ప్రక్రియ పూర్తయినట్లు ప్రకటించింది.

Tags:    

Similar News