సర్వారం సొసైటీ సీఈఓ సస్పెండ్.. GOలో 'దిశ' పేరు ఎందుకంటే..?

దిశ, నేరేడుచర్ల: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని సర్వారం సహకార సంఘంలో ధాన్యం 1010 రకం ధాన్యం కొనుగోలులో భారీ స్కాం జరిగిందని మే 29న దిశ పేపర్‌లో సర్వారం ఫలహరం కథనం వెలువడింది . దీనిపై స్పందించిన సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదికను సమర్పించాలని హుజూర్‌నగర్ ఆర్డీవో వెంకారెడ్డిని ఆదేశించడం జరిగింది. ఈ విచారణలో సహకార సంఘం సీఈవో పరశురాం ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా […]

Update: 2021-06-04 01:26 GMT

దిశ, నేరేడుచర్ల: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని సర్వారం సహకార సంఘంలో ధాన్యం 1010 రకం ధాన్యం కొనుగోలులో భారీ స్కాం జరిగిందని మే 29న దిశ పేపర్‌లో సర్వారం ఫలహరం కథనం వెలువడింది . దీనిపై స్పందించిన సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదికను సమర్పించాలని హుజూర్‌నగర్ ఆర్డీవో వెంకారెడ్డిని ఆదేశించడం జరిగింది. ఈ విచారణలో సహకార సంఘం సీఈవో పరశురాం ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని తేల్చారు. ఆర్డీవో ఈ నివేదికను కలెక్టర్, అడిషనల్ కలెక్టర్‌కు నివేదిక పంపించారు. కలెక్టర్ ఉత్తర్వులు ఆదేశాల మేరకు జిల్లా కో-ఆపరేటివ్ ఆఫీసర్, సీఈఓను సస్పెండ్ చేస్తూ ఈ నెల 3న (గురువారం) ఉత్తర్వులు జారీ చేశారు.

 

Tags:    

Similar News