‘దిశ’ ఎఫెక్ట్ : వాహనాల తొలగింపు.. స్పందించిన మున్సిపల్ కమిషనర్
దిశ ప్రతినిధి, మెదక్ : స్వంత వాహనాలను ప్రభుత్వ కార్యాలయంలో పార్కింగ్ చేయడం సరికాదని మున్సిపల్ కమిషనర్ రమణాచారి సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ కార్యాలయమే ఇల్లు.. అక్కడే కారు అనే కథనం ‘దిశ’లో ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారి స్పందించారు. ప్రభుత్వ పని వేళల్లో మాత్రమే వాహనాలు కార్యాలయంలో పార్కింగ్ చేసుకోవచ్చని, డ్యూటీ ముగియగానే వాహనాన్ని ఆఫీసులో పార్కింగ్ చేయకుండా ఎవరి వాహనం వారు.. వారి ఇంటికి తీసుకువెళ్లాలని ఆదేశించారు. ఇలాంటి […]
దిశ ప్రతినిధి, మెదక్ : స్వంత వాహనాలను ప్రభుత్వ కార్యాలయంలో పార్కింగ్ చేయడం సరికాదని మున్సిపల్ కమిషనర్ రమణాచారి సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ కార్యాలయమే ఇల్లు.. అక్కడే కారు అనే కథనం ‘దిశ’లో ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారి స్పందించారు. ప్రభుత్వ పని వేళల్లో మాత్రమే వాహనాలు కార్యాలయంలో పార్కింగ్ చేసుకోవచ్చని, డ్యూటీ ముగియగానే వాహనాన్ని ఆఫీసులో పార్కింగ్ చేయకుండా ఎవరి వాహనం వారు.. వారి ఇంటికి తీసుకువెళ్లాలని ఆదేశించారు. ఇలాంటి తప్పులు ఎవరు చేయొద్దని, అలా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రభుత్వ కార్యాలయమే ఇల్లు.. అక్కడే కారు పార్కింగ్.. ఇదీ చదవండి