దిశ కథనానికి స్పందన: మోడల్ పాఠశాల సందర్శించిన డీఈ
దిశ,ఖానాపూర్: బడులకు భగీరథ నీళ్లు వచ్చేనా.. అనే కథనం దిశ లో వచ్చిన విషయం తెలుసుకున్న మిషన్ భగీరథ డీఈ ప్రదీప్, ఏఈ సతీష్‌లు శనివారం బుధరావుపేట మోడల్ పాఠశాలకి వచ్చారు. ట్యాంక్‌కి సప్లై చేస్తున్న మెయిన్ గ్రిడ్ నుండి కనెక్షన్ ఇవ్వటానికి కావాల్సినంత డయామీటర్ ఉన్న పైప్ ప్రస్తుతం అందుబాటులో లేనందున పక్కనే ఉన్న హాస్టల్ నుండి ఒక కనెక్షన్ ఇప్పిస్తానని ఉపాధ్యాయులకి తెలియజేసారు. ఇటు దిశ కథనం, అలాగే ఉన్నతాధికారులు ప్రతిష్టాత్మకంగా బడులకు మౌళిక […]
దిశ,ఖానాపూర్: బడులకు భగీరథ నీళ్లు వచ్చేనా.. అనే కథనం దిశ లో వచ్చిన విషయం తెలుసుకున్న మిషన్ భగీరథ డీఈ ప్రదీప్, ఏఈ సతీష్‌లు శనివారం బుధరావుపేట మోడల్ పాఠశాలకి వచ్చారు. ట్యాంక్‌కి సప్లై చేస్తున్న మెయిన్ గ్రిడ్ నుండి కనెక్షన్ ఇవ్వటానికి కావాల్సినంత డయామీటర్ ఉన్న పైప్ ప్రస్తుతం అందుబాటులో లేనందున పక్కనే ఉన్న హాస్టల్ నుండి ఒక కనెక్షన్ ఇప్పిస్తానని ఉపాధ్యాయులకి తెలియజేసారు. ఇటు దిశ కథనం, అలాగే ఉన్నతాధికారులు ప్రతిష్టాత్మకంగా బడులకు మౌళిక సదుపాయాలు కల్పించడంలో పట్టుదలని చూపించడంతో మొత్తానికి కనెక్షన్‌లు దాదాపు అన్ని పాఠశాలలకి 30 లోగా పూర్తవుతున్నట్లే ఉంది.