‘తూర్పు లడాఖ్‌లో ఆ ప్రక్రియ పూర్తి’
న్యూఢిల్లీ: తూర్పు లడాఖ్‌లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. తొమ్మిది దఫాల శాంతి చర్చల తర్వాత భారత్, చైనా బలగాలు సరిహద్దులో బలగాల ఉపసంహరణ చేపట్టాయని వివరించారు. సరిహద్దులో ఏకపక్ష చర్యలను భారత్ ఎట్టిపరిస్థితుల్లో సహించదని, వాటిని ఆపడానికి ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నదని స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో దేశ ఐక్యత, భూభాగ సమగ్రత, సార్వభౌమత్వంలో ఇప్పటి వరకు రాజీపడలేదని, ఇకపైనా పడబోదని […]
న్యూఢిల్లీ: తూర్పు లడాఖ్‌లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. తొమ్మిది దఫాల శాంతి చర్చల తర్వాత భారత్, చైనా బలగాలు సరిహద్దులో బలగాల ఉపసంహరణ చేపట్టాయని వివరించారు. సరిహద్దులో ఏకపక్ష చర్యలను భారత్ ఎట్టిపరిస్థితుల్లో సహించదని, వాటిని ఆపడానికి ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నదని స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో దేశ ఐక్యత, భూభాగ సమగ్రత, సార్వభౌమత్వంలో ఇప్పటి వరకు రాజీపడలేదని, ఇకపైనా పడబోదని ఉద్ఘాటించారు. తమిళనాడులో నిర్వహించిన భారతీయ జనతా యువమోర్చా కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ను విమర్శించారు. ప్రాణాలనే త్యాగం చేసే భారత జవాన్ల ధీరత్వంపై అనుమానపడటం దురదృష్టకరమని అన్నారు.