మాపై ఎందుకీ వివక్ష.. అధికారుల తీరుపై జడ్పీటీసీల ఆవేదన.. అరణ్యరోదనేనా

దిశ, భూపాలపల్లి:  భూపాలపల్లి జిల్లా పరిషత్ సమావేశంలో ఎన్ని సమస్యలు చర్చించిన అది అరణ్యరోదనే మిగిలిపోతుందని సమస్యల పరిష్కారానికి ఎలాంటి స్పందన అధికారుల వద్ద నుండి లేదని జిల్లా పరిషత్ సభ్యులు వాపోతున్నారు. ఇప్పటివరకు జరిగిన సమావేశంలో చర్చించిన అంశాల పరిష్కారానికి రాలేదని, అసలు సమావేశంలో చర్చించిన అంశాలు తీర్మానాలు జరుగుతున్నాయనే అనుమానం వ్యక్తమవుతోంది సభ్యులు వాపోతున్నారు. ముఖ్యంగా భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్ పూర్, మహా ముత్తారం, పలిమెల మండల జడ్పీటీసీ   పట్ల వివక్ష కొనసాగుతోందని సభ్యులు […]

Update: 2021-08-26 23:34 GMT

దిశ, భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లా పరిషత్ సమావేశంలో ఎన్ని సమస్యలు చర్చించిన అది అరణ్యరోదనే మిగిలిపోతుందని సమస్యల పరిష్కారానికి ఎలాంటి స్పందన అధికారుల వద్ద నుండి లేదని జిల్లా పరిషత్ సభ్యులు వాపోతున్నారు. ఇప్పటివరకు జరిగిన సమావేశంలో చర్చించిన అంశాల పరిష్కారానికి రాలేదని, అసలు సమావేశంలో చర్చించిన అంశాలు తీర్మానాలు జరుగుతున్నాయనే అనుమానం వ్యక్తమవుతోంది సభ్యులు వాపోతున్నారు. ముఖ్యంగా భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్ పూర్, మహా ముత్తారం, పలిమెల మండల జడ్పీటీసీ పట్ల వివక్ష కొనసాగుతోందని సభ్యులు వాపోతున్నారు. తాము ఏమి మాట్లాడినా, సమస్యలపై ఎంత స్పందించినా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని జడ్పీటీసీలు ఆరోపణలు చేస్తున్నారు.

కేవలం అధికార పార్టీకి చెందిన వారికి మాత్రమే నిధులు ఎక్కువగా ఇచ్చి తమ పట్ల వివక్ష చూపుతున్నట్లు కాంగ్రెస్ జడ్పీటీసీ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమావేశంలో జరిగిన విషయాలను తీర్మానాలు చేస్తున్నారా తీర్మానం లేకుండా ప్రతిపాదనలు జరుగుతున్నాయానే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చేసిన తీర్మానాలను తమకు అడిగినా ఇవ్వడం లేదని, తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జడ్పిటిసి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పరిషత్ సమావేశంలో జిల్లాలోని సమస్యలపై చర్చించి ఆ సమస్యల పరిష్కారానికి అధికారులు ఏ మాత్రం చొరవ చూపడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ సమావేశంలో చర్చించిన విషయాలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాల్సిన సీఈఓ గారు అసలు తీర్మానము, ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లు జడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ శారద తాము జిల్లా పరిషత్ సమావేశంలో ఏది మాట్లాడినా చెవిటివాని ముందు శంఖం ఊదినట్లు అవుతుందని మహాముత్తారం జడ్పీటీసీ జిల్లాపరిషత్ ప్లోర్ లీడర్ ఆవేదన వ్యక్తం చేశారు.

సమావేశంలో తాము ఏం మాట్లాడినా తన మాటకు విలువ ఇవ్వడం లేదని అధికారులు సైతం సక్రమంగా స్పందించడం లేదని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జిల్లా పరిధిలో నిధుల పంపకంలో సైతం తమ పట్ల వివక్ష చూపుతూ భూపాలపల్లి నియోజకవర్గంలోని జడ్పీటీసీలకు ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారని ఆమె ఆరోపణలు చేశారు. జిల్లా పరిషత్తుకు ఎన్ని నిధులు వచ్చాయనే విషయం కూడా అధికారులు తమకు చెప్పడం లేదన్నారు. జిల్లా పరిషత్ సమావేశంలో జరిగిన తీర్మానాల పత్రం సైతం తమకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తాము గెలిచి మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ప్రజలకు ఏమీ చేయటం లేదని ఆవేదన ఆమె లో ఉంది.

అధికారుల పనితీరు అధ్వానంగా ఉంది..

జిల్లాలో అధికారుల పరిస్థితి అధ్వానంగా ఉందని, తాము అడిగిన సమస్యలపై ఎలాంటి స్పందన లేదని తన ఆవేదన వ్యక్తం చేశారు. మహదేవ్ పూర్ ఆస్పత్రిలో వైద్యులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎన్నిసార్లు సమావేశంలో మొత్తుకున్నా స్పందించేవారు లేరు అన్నారు. మహాదేవపూర్, కాలేశ్వరం మధ్య గల రోడ్డు పూర్తిగా చెడిపోయి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎన్నిసార్లు మొత్తుకున్నా అధికారుల స్పందన లేదన్నారు. జిల్లా పరిషత్ సమావేశాల్లో ఏమి చేసినా లాభం లేదని కేవలం అధికార పార్టీకి చెందిన వారికే పనులు జరుగుతున్నాయని అధికారులు సైతం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ సీఈవో తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని జిల్లా పరిషత్ లో ఏం జరుగుతుందో తెలియటం లేదన్నారు.
సమస్యలపై స్పందన ఉంది – మహాదేవపూర్ జడ్పీటీసీ గుడాల అరుణ

సానుకూలంగా ఉంది..

జిల్లా పరిషత్ లో చర్చించిన సమస్యలపై తమకు సానుకూలంగా ఉందని చిట్యాల జడ్పీటీసీ సాగర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చిట్యాల ఆసుపత్రిలో సౌకర్యాలు కావాలని జిల్లా పరిషత్ సమావేశంలో చర్చించిన వెంటనే స్పందించి సమస్య లేకుండా చేశారని ఆయన తెలిపారు- చిట్యాల జడ్పీటీసీ సాగర్

Tags:    

Similar News