కాళేశ్వరానికి మరో అరుదైన రికార్డు.. అంతర్జాతీయ స్క్రీన్‌పై ప్రదర్శన!

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్జాతీయ తెరపై ప్రదర్శనకు వస్తోంది. డిస్కవరీ నెట్వర్క్‌లో ప్రత్యేక డాక్యమెంటరీని ప్రదర్శించనున్నారు. ఈ నెల 25న రాత్రి 8 గంటలకు డిస్కవరీ హెచ్‌డీలో తొలి ప్రసారం కానుంది. ఆ తర్వాత ఈ నెల 27న మధ్యాహ్నం 2.32 గంటలకు అదే ఛానల్‌లో ప్రసారం కానుంది. ఇక డిస్కవరీ సైన్స్‌లో 28న రాత్రి 9 గంటలకు, 29న సాయంత్రం 4.50 గంటలకు, డిస్కవరీ టర్బోలు […]

Update: 2021-06-19 11:48 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్జాతీయ తెరపై ప్రదర్శనకు వస్తోంది. డిస్కవరీ నెట్వర్క్‌లో ప్రత్యేక డాక్యమెంటరీని ప్రదర్శించనున్నారు. ఈ నెల 25న రాత్రి 8 గంటలకు డిస్కవరీ హెచ్‌డీలో తొలి ప్రసారం కానుంది. ఆ తర్వాత ఈ నెల 27న మధ్యాహ్నం 2.32 గంటలకు అదే ఛానల్‌లో ప్రసారం కానుంది.

ఇక డిస్కవరీ సైన్స్‌లో 28న రాత్రి 9 గంటలకు, 29న సాయంత్రం 4.50 గంటలకు, డిస్కవరీ టర్బోలు ఈనెల 29న రాత్రి 9.50 గంటలకు, మళ్లీ 30న సాయంత్రం 4.50 గంటలకు ప్రసారం చేయనున్నారు. డిస్కవరీ ప్లస్​ఓటీటీలో ఈనెల 25 నుంచి వీక్షించేందుకు కాళేశ్వరం డాక్యమెంటరీ ఉండనుంది.

Tags:    

Similar News